
పోలీసుల చేతికి చిక్కిన గంజాయి ముఠా
మహారాష్ట్ర పోలీసులు మాదకద్రవ్యాల మాఫియాకు గట్టి షాక్ ఇచ్చారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో చురుకుగా ఉన్న 17 మంది నిందితులపై అత్యంత కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ ముఠా నాయకుడు పాత నేరస్తుడు అయిన గుఫ్రాన్ హన్నన్ షేక్‌తో సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్ర నుండి పూణే వరకు విస్తరించిన గంజాయి నెట్‌వర్క్
ఈ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి గంజాయిని తీసుకువచ్చి మహారాష్ట్రలోని థానే, కళ్యాణ్, బద్లాపూర్, షోలాపూర్, పూణే వంటి కీలక నగరాల వరకు తమ పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించింది. అంతేకాక ఈ ముఠా పక్క ప్లాన్ తో ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (కళ్యాణ్) అతుల్ జెండే తెలిపారు. కాగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్యాణ్‌జీ ఘేటే నేతృత్వంలో రెండు నెలల క్రితం ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు.
రూ. 70 లక్షల విలువైన ఆస్తులు స్వాధీనం
పోలీసులు జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో గంజాయి, ఆయుధాలు లభ్యమయ్యాయి. మరోవైపు నిందితులను పోలీసులు మొదట 62 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, తదుపరి జరిపిన విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా మరో 115 కిలోల గంజాయిని రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 177 కిలోల గంజాయి, పిస్టల్స్ వాహనాల విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అంచనా.
ముఠాలోని ఐదుగురు కీలక సభ్యులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 21 క్రిమినల్ కేసులు నమోదై ఉండటం ఒక పతాకం ప్రకారం వారు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలియడం వల్లే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టాన్ని ప్రయోగించామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబందించి నేరానికి పాల్పడిన నలుగురు కీలక సహచరులు ఇంకా పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.
