
పోక్సో చట్టం ఏం చెబుతోంది?
పిల్లలు మన దేశ భవిష్యత్తు. వారిని భద్రంగా, గౌరవంగా, భయరహితంగా పెంచడం ప్రతి తల్లిదండ్రి, గురువు, సమాజం బాధ్యత. కానీ కొంతమంది చెడు వ్యక్తులు పిల్లలను లైంగికంగా వేధించడం, దుర్వినియోగం చేయడం, బెదిరించడం వంటి ఘోర నేరాలకు పాల్పడుతున్నారు. ఈ సమస్యను అరికట్టడానికి భారత ప్రభుత్వం 2012లో పోక్సోచట్టం”ను (Protection of Children from Sexual Offences Act) అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులు, దుర్వినియోగాలను నివారించడానికి రూపొందించబడింది. దీని ప్రధాన ఉద్దేశం పిల్లలను రక్షించడం, నేరస్తులను కఠినంగా శిక్షించడం, పిల్లలకు న్యాయం చేయడం. ఇది 14 నవంబర్ 2012న బాలల దినోత్సవం రోజున అమల్లోకి వచ్చింది. తరువాత 2019లో సవరణలు చేసి మరింత కఠినమైన శిక్షలు చేర్చారు. పిల్లలపై లైంగిక దాడులు పెరగడం, పాత చట్టాలు తగిన రక్షణ ఇవ్వకపోవడం, లైంగిక నేరాల నిర్వచనం స్పష్టంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ చట్టం అవసరమైంది. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు పూర్తి కాని ప్రతి ఒక్కరు పిల్లలుగా పరిగణించబడతారు. బాలురు, బాలికలు ఇద్దరూ రక్షణ పొందుతారు.
పోక్సో చట్టం వివిధ రకాల లైంగిక నేరాలను వర్గీకరిస్తుంది. లైంగిక దాడి అంటే పిల్లల శరీరాన్ని అనవసరంగా ముట్టుకోవడం, తాకడం, లేదా అశ్లీల ప్రవర్తన చేయడం. తీవ్రమైన లైంగిక దాడి అంటే గురువు, పోలీసు, వైద్యుడు, బంధువు లాంటి అధికారం కలిగిన వ్యక్తి పిల్లపై దాడి చేస్తే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. లైంగిక వేధింపులు అంటే అశ్లీల మాటలు, చూపులు, సంకేతాలు, వీడియోలు లేదా ఫోటోలు చూపడం లేదా పంపడం. పిల్లలను అశ్లీల వీడియోలు లేదా ఫోటోలలో ఉపయోగించడం కూడా పెద్ద నేరం. పిల్లపై ఏదైనా లైంగిక వేధింపులు జరిగితే వెంటనే పోలీసులకు లేదా 1098 చైల్డ్‌లైన్ నంబరుకు ఫోన్ చేయాలి. గురువులుకు లేదా తల్లిదండ్రులుకు తెలిసినా వెంటనే ఫిర్యాదు చేయాలి. పోలీసు ఫిర్యాదు తీసుకోవడం తప్పనిసరి. తీసుకోకపోతే వారు కూడా నేరస్తులుగా పరిగణించబడతారు. పిల్ల పేరు, ఫోటో లేదా వివరాలు బయట పెట్టరాదు. ప్రతి జిల్లాలో ప్రత్యేక పోక్సో కోర్టు ఉంటుంది. కోర్టు పిల్లల వయస్సు, మానసిక స్థితి దృష్టిలో ఉంచుకుని విచారణ చేస్తుంది. విచారణ గరిష్టంగా ఒక సంవత్సరంలోపు పూర్తి చేయాలి. పిల్ల సాక్ష్యం ఇవ్వడానికి భయపడకుండా వాతావరణం సృష్టిస్తారు.
ఈ చట్టం కింద లైంగిక దాడికి కనీస శిక్ష 3 సంవత్సరాలు, గరిష్టంగా 5 సంవత్సరాలు. ప్రవేశాత్మక లైంగిక దాడికి కనీసం 10 సంవత్సరాలు, గరిష్టంగా జీవితఖైదు లేదా మరణశిక్ష. పిల్లల అశ్లీల వినియోగానికి 5 నుంచి 7 సంవత్సరాల శిక్ష. అబద్ధపు ఫిర్యాదు చేసిన వారికి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది. పిల్లలు ఎవరైనా తమ శరీరాన్ని తాకితే “వద్ధు ” అని గట్టిగా చెప్పాలి. వెంటనే తల్లిదండ్రులకు లేదా గురువులకు చెప్పాలి. భయపడకూడదు, ఎందుకంటే మీరు తప్పు చేయలేదు. మీ గోప్యత మీ హక్కు. ఫిర్యాదు చేయడం మీ భద్రతకు రక్షణ. పాఠశాలలు పిల్లలకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” గురించి వివరించాలి. స్కూల్‌లో లైంగిక వేధింపుల నివారణ కమిటీ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి అవగాహన కల్పించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పోక్సో ప్రత్యేక కోర్టులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇంకా చాలా కేసులు భయం, సిగ్గు, ఒత్తిడి కారణంగా రిపోర్ట్ చేయబడటం లేదు. అందుకే పిల్లలకు అవగాహన చాలా ముఖ్యం. పోక్సోచట్టం పిల్లలను రక్షించే బలమైన కవచం. మనందరం కలిసినప్పుడు మాత్రమే ప్రతి చిన్నారి భద్రంగా ఉంటుంది. పిల్లలు భయపడకుండా, గౌరవంగా, స్వేచ్ఛగా జీవించే హక్కు వారిది. పిల్లల రక్షణ మన సమాజ ధర్మం. పోక్సోచట్టం పిల్లలను లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల వినియోగం నుండి రక్షించే భారత చట్టం. ఇది ప్రతి చిన్నారికి భద్రతా హక్కు కల్పిస్తుంది మరియు నేరస్తులకు కఠిన శిక్షలు విధిస్తుంది.
విద్యార్దులకు పోక్సో గురించిన అవగాహన ఎందుకు అవసరం?
విద్యార్ధులకు పోక్సో చట్టం గురించి తెలియ చెప్పడం చాలా అవసరం, ఎందుకంటే ఇది వారి భద్రత, హక్కులు, మరియు జీవన నైపుణ్యాల కోసం కీలకం. చిన్నపుడే పిల్లలకు శరీర స్వతంత్రం,గుడ్ టచ్ ,బాడ్ టచ్ గురించి అవగాహన అవసరం. ఎవరైన అత్యాచారానికి గురైతే వారుపోలీసులకు రిపోర్ట్ చేసే హక్కులు వంటి విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అవగాహన ఉన్న పిల్లలు ఏ పరిస్థితులు ప్రమాదకరమో, ఎవరు నమ్మకం గల పెద్దవారుగా ఉండాలో తెలుసుకుంటారు, అందువల్ల అనవసరంగా భయపడకుండా, సమయానికి సహాయం పొందే అవకాశం ఉంది. వారు ఆన్‌లైన్‌లో కూడా భద్రంగా ఉండటానికి, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా కాపాడుకోవాలో, నేరస్థులను ఎలా నివారించాలో తెలుసుకుంటారు. విద్యార్ధులలో ఈ చట్టం గురించి అవగాహన పెంపొందించడం ద్వారా వారు సులభంగా సమస్యలను గుర్తించి, నమ్మకమైన పెద్దవారికి చెప్పగలుగుతారు, బాధితులుగా మారకుండా ఉంటారు. అలాగే స్కూల్, టీచర్, తల్లిదండ్రులతో కలసి సహకరించి భద్రతా వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. చిన్నారులలో సున్నితమైన సమస్యలపై భయరహిత, నమ్మకమైన సంభాషణలు ఏర్పడతాయి, ఇది వారి మానసిక ఆరోగ్యానికి మరియు భవిష్యత్తు సామాజిక నైపుణ్యాలకు మద్దతుగా ఉంటుంది. ఈ చట్టం గురించి విద్యార్ధులు తెలుసుకోవడం ద్వారా వారు తమ హక్కులను గౌరవిస్తూ, ప్రమాదాలను ముందుగానే గుర్తించి, సమాజంలో ఒక సురక్షిత, బాధ్యతాయుత వ్యక్తిగా ఎదుగుతారు.
ముఖ్య విషయాలు
దాడిని గుర్తించగలగడం - చాలా పిల్లలు అస్పష్టంగా ఉన్న అనుభవాలను “తప్పు” అన్నట్టుగా భావిస్తారు. అవగాహన ఉంటే పిల్లలు ఏది తప్పు, ఏ పరిస్థితులు ప్రమాదకరమో గుర్తిస్తారు ఇది వారి తొలుత సంరక్షణకు దారితీస్తుంది.వారిపై దాడి జరిగితే వెంటనే గుర్తిస్తారు .
రిపోర్ట్ చేయడానికి ప్రోత్సాహం - చాలా సందర్భాల్లో బాధితులు లేదా వెంటనే సమాచారం ఇవ్వలేరు లేదా సిగ్గు కారణంగా. అవగాహనతో, వారికి ఎక్కడ చెప్పాలో, ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలుసుకుని (ఉదా: పోలీస్/చైల్డ్‌లైన్/స్కూల్ అధికారులు) సకాలంలో సహాయం పొందుతారు. (చైల్డ్‌లైన్ 1098 వంటి కేంద్రీయ హెల్‌లైన్ల సమాచారం అందుబాటులో ఉండాలి).
భయాన్ని తగ్గించి బాధితులకు మద్దతు: దాడి జరిగిన తర్వాత పిల్లలు ఒంటరిగా, అపవిష్కృతంగా ఉంటే బాధ తగినంత తీవ్రంగా ఉంటుంది. స్కూల్ స్థాయిలో సంభాషణ మరియు మద్దతు ఉన్నపుడు బాధితులకు అవసరమైన మానసిక సహాయం త్వరగా లభిస్తుంది. పిల్లలకు శరీరమే వారి హక్కు అని, “సరైన” మరియు “సరిపోని” టచ్ మధ్య తేడాను), సేఫ్-సిక్రెట్ vs హార్మ్‌ఫుల్ సిక్రెట్ తేడా వంటి విషయాలు నేర్పించడం ద్వారా అనేక దాడులను ముందుగానే నివారించవచ్చు.
ఆన్లైన్‌పై అవగాహన : ఇటీవల కాలంలో అధిక శాతం మానవ సంబంధాలు , ప్రమాదాలు ఆన్‌లైన్ వేదికగా గా జరుగుతున్నాయి. అశ్లీల మెసేజ్‌లు, సెక్స్‌టింగ్, ఆన్‌లైన్ ట్రాపింగ్ లాంటివి ఎక్కువైపోయాయి. పిల్లలకు ఆన్‌లైన్ ప్రైవసీ అంటే ఏమిటి , ఎవ్వరితో ఏం షేర్ చేయకూడదు అనే విషయాలు తెలియజేయాలి. అవసరమైతే రిపోర్ట్ ఎలా చేయాలి వంటి అంశాలు తెలియాలి.
న్యాయశాస్త్రం పట్ల అవగాహన : పోక్సోచట్టం ప్రకారం ఏమైనా సంఘటన జరిగితే ఏమవుతుందో (పోలీసు విచారణ, వైద్యపరీక్ష, ప్రత్యేక పోక్సో కోర్టులు), బాధితుడి హక్కులు (గోప్యతలు, కోర్టులో పిల్లల రక్షణ) గురించి పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు తెలుసుకోవాలి. అధికారిక మార్గదర్శకాలు ప్రతి పాఠశాలలకు సూచనలు ఇస్తున్నాయి. అవి పాటించడం అతి ముఖ్యమైందిగా బావించాలి .
స్టూడెంట్స్‌కు శిక్షణలో ఉండాల్సిన ముఖ్య అంశాలు
బాడీ ఆటానమీ : “మీ శరీరం మీదే”, ఎవరైనా మీ శరీరాన్ని ముట్టుకోవడానికి మీ అనుమతి తప్పనిసరి అనే విషయంతో పాటు , గుడ్ టచ్ బాడ్ టచ్ ఉదాహరణలతో స్పష్టంగా చెప్పాలి.
ఎవరు మిమ్మల్ని ఏమైన చెడు మాటలు చెప్పి రహస్యంగా ఉంచమని చెపితే అది వెంటనే వాళ్ళ పెద్ధ వాళ్ళకి చెప్పమనాలి . ఎక్కడ పట్టుకున్న నన్ను పట్టుకోకు అని చెప్పడం నేర్చుకోవడం మరియు తక్షణంగా టీచర్ కి గాని అమ్మానాన్నకు గాని చెప్పాలనే అవగాహన కల్పించాలి.
ఒక్కో పిల్లకు నమ్మకమైన పెద్దల జాబితా (తండ్రీ, తల్లి, గురువు, స్కూల్ కౌన్సెలర్).తయారుచేయమని చెప్పాలి. వ్యక్తిగత ఫొటోలు ఎప్పుడు/ఎవరికీ ఇవ్వకూడదో, ఎవరైన బాధిస్తే స్క్రీన్‌షాట్ తీసి ఎలా రిపోర్ట్ చేయాలో నేర్పించాలి
స్కూల్‌లు, టీచర్లు, తల్లిదండ్రుల బాధ్యతలు
పాలసీలు : ప్రతి స్కూల్‌కి నిర్దిష్ట చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ, రిపోర్టింగ్ మెకానిజం ఉండాలి (స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ తో సమన్వయం). ప్రభుత్వ, NCPCR మార్గదర్శకాలు స్కూల్‌లకు సూచనలు ఇస్తున్నాయి.వాటిని పాటించాలి . శిక్షణ, పోక్సో చట్టం అవగాహన సెషన్లు విశేష శిక్షితులు/ప్రొఫెషనల్స్ (చైల్డ్ రైట్స్ శిక్షణ పొందిన వర్గాలు) ద్వారా నిర్వహించాలి; అనుభవ రహిత ట్రైనర్లు వత్తిడి లేదా భయాన్ని కలిగించవచ్చని గతంలో సూచనలు ఉన్నాయి.స్కూల్‌లో స్పెషల్ టీం ని నియమించాలి. పిల్లలు ఎప్పుడు ఎలా రిపోర్ట్ చేయాలో స్పష్టంగా తెలియ చేయాలి.
కౌన్సెలింగ్ & మెడికో-లీగల్ సహాయము, బాధితుడికి తక్షణ మానసిక-సాంఘిక మద్దతు నిర్వహించాలి; అవసరమైతే వైద్య పరీక్షలు, పోలీసు నోటీస్లు అనుసరించాలి.
తల్లిదండ్రులు మెల్లగా కథనాలు అడగకుండా పిల్లలతో ఓపెన్ సంభాషణ జరపాలి.
ఎలా నేర్పాలి - వయస్సు అనుగుణంగా: చిన్న పిల్లలకే సరిపడే భాష, ఆటలు, కథలు. పెద్దలకి రోల్-ప్లేస్, డిస్కషన్ ద్వారా ఈ విషయాలు నేర్పాలి. రచనా వ్యాయామం, డ్రామాలు, వివరమైన ప్రశ్నలు జవాబులు ద్వారా నేర్పించాలి. విజువల్స్ & కార్టూన్స్ ద్వారా నేర్పితే ప్రత్యేకంగా చిన్న పిల్లలకు జ్ఞాపకంగా ఉంటుంది. తరచుగా రివిజన్ చేస్తూ ఒక్కసారి పెద్ద సెషన్ చేయడం కన్నా చిన్న చిన్న పాఠాలు లా నేర్పించాలి. బాధితుడు భయం పడకుండానే, సంరక్షణతో వ్యవహరించాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సహాయ వ్యక్తులు ఎంపిక చేయాలి సాధ్యమైన ఒక సెషన్ ప్లాన్ (ఉదాహరణ) — స్కూల్ లో ప్రైమరీ వాళ్ళకి (5–8 yrs) 30–40 నిమిషాలు, అప్పర్ ప్రైమరీ (9–12 yrs) — 45 నిమిషాలు ,పెద్ధ తరగతుల వారికి (13–18 yrs) — 60 నిమిషాలు క్లాసులు ఏర్పాటుచేయాలి . ఈ చట్టం గురించిన విషయాలు బోర్డు పై రాసి పాఠశాలలో వుంచాలి.
ప్రతి తరగతిలో వయస్సుకి తగిన అవగాహన పాఠ్యాంశాన్నిపుస్తకాలల్లో చేర్చాలి . అదే విధంగా ట్రైనైన్డ్ రీసోర్స్ పర్సన్‌లు మాత్రమే సెషన్లు చేయాలి. స్కూల్‌లో ఒక నిజాయితీ గల ఆఫీసర్ ను నియమించండి.ప్రతీ స్కూల్‌కు 1098/పోలీస్ నంబర్లు ఏర్పాటుచెయ్యాలి. టీచర్స్‌కి బేసిక్ సైకాలాజికల్ రీస్పాన్స్.శిక్షణ ఇవ్వాలి. స్కూల్ లో ఉండే సిబ్బంది, వాలంటీర్లపై అనుచిత రిస్కు తగ్గించడానికి నిఘా అవశ్యం చెయ్యాలి. రిపోర్ట్ చేయాలని పిల్లలకు చెప్పే స్పష్టమైన ‘ఒక రెండు స్టెప్పుల’ సూచనలు తక్షణంగా మీరు నమ్మిన పెద్దవారికి లేదా స్కూల్ ఆఫీసర్‌కు వెంటనే చెప్పండి.అని సూచనలు ఇవ్వాలి. ఎమర్జెన్సీ అయితే 100 లేదా 1098 (Childline) కి కాల్ చేయండిఅని చెప్పాలి . సాధ్యమైతే ఎవరితో జరిగినదో రాసి పెట్టుకోవాలి. తేది, చోటు, వ్యక్తుల పేర్లు మీరు తప్పు చేయలేదని గుర్తుంచుకోండి ,సహాయం అందుతుంది అని వారికి అర్దమయ్యేలా చెప్పాలి. చిన్నారుల్లో భయం పెంచడం కాకుండా అవగాహన పెంచాలి.
అశ్లీల పదజాలం దూరంగా వారిని ఉంచాలి. ఒక సెషన్‌లో చాలా సున్నిత విషయాలు అనవసరంగా వివరించకూడదు. అవసరమైతే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఓపెన్ సంభాషణ చెయ్యాలి.
చిన్న విషయాలపైనా వారు మీతో చెప్పగలిగే వాతావరణం ఇవ్వండి. సోషల్ మీడియా/ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీ సెట్టింగ్స్ నియంత్రించాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ని సరళంగా చెబుతూ వారిని అనవసరంగా శిక్షించవద్దు. పిల్లలు ఏమి చెప్పినా వారిని నమ్మాలి. వెంటనే నమ్మకంతో చర్యలు తీసుకోవాలి పిల్లలకు రక్షణ లేకపోవడం సమాజo పై విపరీత ప్రభావం కలిగిస్తుంది. ఇది వారి మానసిక, భౌతిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. పోక్సోచట్టం ద్వారా మాత్రమే బాధితులకు పూర్తిస్థాయి రక్షణా వ్యవస్థను అందించగలం. పోలీసులు, వైద్యులు, కోర్టు ప్రక్రియ, ప్రత్యేక కోర్టులు అనే గమ్యస్థానాలు అందుబాటులో ఉన్నాయి.అయితే అవి పిల్లల హక్కులను ఉల్లంఘించకుండా పని చేయాలి. పిల్లలలో పోక్సో చట్టం పై అవగాహన కల్పించడం కేవలం చట్టపరమైన అవసరం మాత్రమె కాదు . ఇది మానవత్వానికి సంబంధించిన బాధ్యత. సరైన జ్ఞానం ఇచ్చినప్పుడు పిల్లలు తమ హక్కులను గౌరవిస్తూ, ప్రమాదాలను గుర్తించి, అవసరమైన నడకను తీసుకుంటారు. స్కూల్స్, టీచర్లు, తల్లిదండ్రులు ఒకరితో ఒకరు సహకరించగా మాత్రమే ఈ అవగాహన విస్తృతంగా, భద్రతాత్మకంగా అమలవుతుంది.
పోక్సో చట్టం అంటే ఏమిటి?
పోక్సో అంటే పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించు చట్టం
“పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులు, దుర్వినియోగాల నుండి రక్షణ కల్పించడానికి రూపొందించిన చట్టం”. దీన్ని 2012లో సంవత్సరంలో భారత ప్రభుత్వం
వేశపెట్టిoది. అమల్లోకి వచ్చిన తేదీ: 14 నవంబర్ 2012 (బాలల దినోత్సవం రోజునే)
2019లో కొన్ని కఠినమైన మార్పులు చేశారు (ఉదా: బాలికలపై అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించే నిబంధన). పోక్సో చట్టం ఏర్పడటానికి ప్రధాన కారణాలు - దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు పెరగడంవల్ల . దీన్నిపాత చట్టాలు (ఉదా: IPC) చిన్నారుల రక్షణకు తగిన విధంగా లేకపోవడం.లైంగిక నేరాల నిర్వచనం స్పష్టంగా లేకపోవడం.
బాలురు మరియు బాలికలు రెండింటినీ రక్షించే స్పష్టమైన చట్టం అవసరం కావడం.
ఈ చట్టం ప్రకారం ఎవరు “పిల్లలు - 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ఎవ్వరైనా “పిల్ల”గా పరిగణించబడతారు.
పోక్సోచట్టం ప్రధాన ఉద్దేశాలు - పిల్లలను అన్ని రకాల లైంగిక దాడుల నుండి రక్షించడం. నేరాల విచారణ త్వరగా పూర్తి చేయడం. బాధిత పిల్లల గోప్యతను కాపాడడం.
వారికి సురక్షిత వాతావరణంలో సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం కల్పించడం.బాధితుడికి వైద్య, మానసిక, న్యాయ సహాయం అందించడం. పోక్సోచట్టం వివిధ రకాల నేరాలను వర్గీకరించింది:
ప్రవేశాత్మక లైంగిక దాడి- పిల్లలపై బలవంతంగా లైంగిక చర్య చేయడం.
ఈ నేరానికి కనీస శిక్ష 10 సంవత్సరాలు - గరిష్టంగా జీవిత ఖైదు లేదా మరణశిక్ష (2019 సవరణ తరువాత).
తీవ్ర లైంగిక దాడి - తల్లిదండ్రులు, పోలీసు, ఉపాధ్యాయులు లేదా అధికారం కలిగినవారు చేసినట్లయితే. ఈ నేరానికి శిక్ష -జీవిత ఖైదు లేదా మరణశిక్ష.
లైంగిక వేధింపు - పిల్లల శరీరాన్ని అనవసరంగా తాకడం, ముట్టుకోవడం మొదలైనవి.
లైంగిక హింస లేదా వేధింపు - అసభ్య పదజాలం, చూపులు, అశ్లీల సంకేతాలు, వీడియోలు, ఫోటోలు మొదలైనవి. పిల్లలను అశ్లీల వీడియోలు, ఫోటోలు లేదా ప్రదర్శనల కోసం ఉపయోగించడం.
విచారణ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
ఫిర్యాదు నమోదు: పిల్లలపై లైంగిక దాడి గురించి ఎవరికైనా తెలిసినప్పుడు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు తీసుకోకపోతే, సంబంధిత SP (Superintendent of Police) వద్ద ఫిర్యాదు చేయవచ్చు. బాధితుని వాంగ్మూలం మహిళా పోలీసు తీసుకోవాలి. రాత్రివేళల్లో లేదా ప్రమాదకర పరిస్థితుల్లో వాంగ్మూలం తీసుకోవరాదు. పిల్లకు మానసిక ఒత్తిడి కలగకుండా వాతావరణం కల్పించాలి. వైద్య పరీక్ష బాధితుడి అనుమతితో మాత్రమే జరగాలి. అమ్మాయిలను పరీక్షించే వారు మహిళా వైద్యులు కావాలి. ప్రత్యేక పోక్సో కోర్టులో కేసు వేయాలి. విచారణ గరిష్టంగా 1 సంవత్సరంలోపు పూర్తి చేయాలి. పిల్ల గోప్యత రక్షించబడుతుంది (మీడియాలో పేరు, ఫోటో వెల్లడించకూడదు). పోక్సో చట్టం పిల్లలను (18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారిని) లైంగిక దాడి, వేధింపులు, దుర్వినియోగం నుండి రక్షించడానికి రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి వేర్వేరు రకాల శిక్షలు విధిస్తారు.
ముఖ్యమైన శిక్షలు
సాధారణ లైంగిక దాడి- పిల్లపై అనుమతి లేకుండా లైంగిక స్పర్శ చేయడం.శిక్ష కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా 5 సంవత్సరాల వరకు, అలాగే జరిమానా కూడా ఉంటుంది.
తీవ్రమైన లైంగిక దాడి - ఉపాధ్యాయుడు, పోలీసు, డాక్టర్ లేదా బాధితుని మీద అధికారం ఉన్న వ్యక్తి ఇలాంటి నేరం చేయడం. శిక్ష కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష గరిష్టంగా 7 సంవత్సరాల వరకు, అలాగే జరిమానా కూడా ఉంటుంది.
లైంగిక దుర్వినియోగo - అసభ్యమైన మాటలు, చూపులు, సంకేతాలు చేయడం లేదా పిల్లవాడిని అశ్లీలంగా ప్రవర్తించడం.శిక్ష-మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షలేదా జరిమానాలేదా రెండూ ఉంటాయి.
పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్- పిల్లవాడిపై బలవంతంగా లైంగిక చర్య చేయడం. శిక్ష కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష గరిష్టంగా జీవిత ఖైదు వరకు, అలాగే జరిమానా కూడా ఉంటుంది.
తీవ్రమైన పెనిట్రేటివ్ లైంగిక దాడి - బాధితుడు అంగవైకల్యం ఉన్నవాడు కావడం, నిందితుడు అధికారి లేదా రక్షణదారుడు కావడం వంటి పరిస్థితుల్లో, శిక్షకనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా జీవిత ఖైదు లేదా మరణదండన (2019 సవరణ ప్రకారం) విధించవచ్చు.
పిల్లల అశ్లీల చిత్రాలు తయారు చేయడం లేదా చూపించడం (Child Pornography) శిక్ష-మొదటి తప్పు కోసం 5 సంవత్సరాల జైలు , రెండోసారి చేస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా.
తప్పుడు ఫిర్యాదులు చేయడం - ఎవరు తప్పుడు ఆరోపణలు చేస్తే వారికి కూడా ఆరు నెలల వరకు జైలులేదా జరిమానా విధించవచ్చు.చట్టం కఠినంగా అమలు చేయబడుతుంది. ఇది పిల్లల భద్రత, గౌరవం, భవిష్యత్తు కాపాడేందుకు ఉద్దేశించబడిన అత్యంత ముఖ్యమైన చట్టం. ప్రతి ఒక్కరూ దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టడంలో సహకరించాలి.
ప్రస్తుతం ప్రభుత్వ చర్యలు: ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు,పిల్లల సంక్షేమానికి చైల్డ్ వెల్ ఫైర్ కమిషన్ ఏర్పాటు , పోలీస్ లకు సున్నితమైన కేసులు ఎలా నిర్వహించాలో శిక్షణ. పాఠశాలలు, గ్రామాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
సవాళ్లు: చాలా కేసులు సమాజ భయంతో లేదా కుటుంబ ఒత్తిడితో నివేదించబడవు. తప్పు ఆరోపణల వల్ల కొందరు నిరపరాధులు ఇబ్బందులు పడుతారు.కేసుల పరిష్కారం న్యాయ వ్యవస్థ ఆలస్యంతో సమయం గడిచిపోతుంది.
ముఖ్యమైన అంశం: POCSO చట్టం కింద ఎవరికైనా పిల్లలపై దాడి జరిగిందని తెలిసినా ఫిర్యాదు చేయకపోతే, ఆ వ్యక్తికి కూడా శిక్ష ఉంటుంది.ఇది తప్పనిసరి నివేదిక చట్టం
పోక్సో చట్టం భారతదేశంలో పిల్లల భద్రతకు కీలకమైన న్యాయపరమైన అడుగు.
ఇది కేవలం శిక్షించడానికి కాదు, పిల్లలను రక్షించడానికి, వారికి న్యాయం అందించడానికి, మరియు సమాజంలో భద్రతా వాతావరణం సృష్టించడానికి రూపొందించబడింది.కాబట్టి దీనిపై విద్యార్ది దశ నుండి పిల్లలకు అవగాహన అవసరం .
