Let's talk: editor@tmv.in
పొంగులేటి ఏంటో అందరికీ తెలుసు

పొంగులేటి ఏంటో అందరికీ తెలుసు

Aravind Maryada Reddy
14 అక్టోబర్, 2025

కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం ఇటీవల బాగా ముదిరిన విషయం తెలిసిందే. ఈ అంశం అధిష్ఠానం దాకా వెళ్లింది. మేడారం పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లను పొంగులేటి తన అనుచరులకు ఇప్పించుకున్నాడన్నది కొండా సురేఖ ఆరోపణ. ఈ ఆరోపణలకు తాజాగా పొంగులేటి స్పందించారు. సురేఖ ఆరోపణల ప్రకారం, జాతర అభివృద్ధి కాంట్రాక్టులు పారదర్శకంగా కాకుండా, కొంతమంది పరిచయుల కంపెనీలకు మాత్రమే ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, నిధుల వినియోగంలో కూడా పెద్ద లాభాలు తన అనుచరులకు చేరేలా ప్రయత్నాలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలను బయటపెట్టడంతో, వెరసి ప్రభుత్వం మీద కూడా చెడ్డపేరు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఈ ఆరోపణలను ఖండించారు. ఆయన తెలిపారు. తన కంపెనీకి 60–70 కోట్ల రూపాయల కక్కుర్తి పడేవాడిని కాదు. నేను ఏమిటో అందరికీ తెలుసంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా, భక్తులు, గిరిజనుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నాయని పొంగులేటి పేర్కొన్నారు. .మాస్టర్ ప్లాన్ ప్రకారం, 90 రోజుల్లో పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. సీతక్క, సురేఖతో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని స్పష్టం చేశారు.

మేడారం పనులు చేపట్టిన కంపెనీ ఏది?

ఇప్పటి వరకు మేడారం పనులు చేసిన కంపెనీ పేరు మీడియా ముందు రాలేదు. సురేఖ–పొంగులేటి వివాదం ప్రధానంగా కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల వినియోగం, గ్రూప్ రాజకీయాల చుట్టూ దృష్టి సారించింది. పొంగులేటి ఖచ్చితమైన కౌంటర్ వాదన వల్ల ఈ వివాదానికి కొంతమేర పారదర్శకత మరియు న్యాయపూర్వక అభివృద్ధి దృక్పథం వచ్చిందని అంచనా.

సురేఖ ఆరోపణలు ఏమిటి?

దేవాదాయశాఖకి సంబంధిచిన రూ 71 కోట్ల టెండర్ ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపణ. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు సంబంధం లేకుండా పొంగులేటి జోక్యం చేసుకోవటం పైన సురేఖ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మొదట్లో కొండా సురేఖ భర్త మురళి స్పందించారు. ఆ తర్వాత సురేఖ కూడా రియాక్ట్ అయ్యారు. అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు.

పొంగులేటి ఏంటో అందరికీ తెలుసు - Tholi Paluku