Let's talk: editor@tmv.in
పేదింటి విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా!

పేదింటి విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా!

Panthagani Anusha
6 డిసెంబర్, 2025

పేద విద్యార్థులకు అండగా నిలవడంలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గొప్ప మనసు చాటుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,087 మంది పదో తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించి వారిపై తన ప్రేమాభిమానాన్ని కనబరిచారు.

రూ. 2.60 లక్షల ఫీజు చెల్లింపు

ఈ పదో తరగతి విద్యార్థులు ఒక్కొక్కరు పబ్లిక్ పరీక్ష ఫీజు కింద రూ. 125 చొప్పున విద్యా శాఖకు చెల్లించాల్సి ఉంది. మొత్తం 2,087 మంది విద్యార్థుల తరఫున, ఆ మొత్తం రూ. 2,60,875 ను మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఓ)కు చెల్లించారు.

ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని 41 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ సాయాన్ని అందుకున్నారు.లబ్ధిపొందిన విద్యార్థులలో 1,096 మంది బాలికలు ఉన్నారు. ఈ మేరకు చెల్లించిన ఫీజు వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి, సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.

ప్రోత్సాహకరంగా మంత్రి చిరు ప్రయత్నం

పేద విద్యార్థులకు ప్రోత్సాహకరంగా, ప్రేరణగా ఉండేందుకు మంత్రి ఈ చిన్న ప్రయత్నం చేశారని ఆయన సన్నిహితులు తెలిపారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ చొరవను ధర్మవరం నియోజకవర్గ ప్రజలు, విద్యార్థి సంఘాల నేతలు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. వందలాది మంది పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించి, వారు ఆందోళన లేకుండా పరీక్షలపై దృష్టి సారించేందుకు మంత్రి చేసిన సాయం ఎంతో విలువైనదని విద్యాభిమానులు పేర్కొంటున్నారు.

ధర్మవరం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి మండలాలు ఉన్నాయి. ఈ మండలాలల్లో ఉన్న 41 ప్రభుత్వ పాఠశాలల్లో 2,087 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ విద్యార్థులు అందరి తరఫున పబ్లిక్ పరీక్షల ఫీజును మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా చెల్లించారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 కాగా.. 2087 మంది విద్యార్థులకు కలిపి.. మొత్తం రూ.2,60,875లను జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు.

పేదింటి విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా! - Tholi Paluku