Let's talk: editor@tmv.in
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Gaddamidi Naveen
22 ఫిబ్రవరి, 2026

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో 180 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రూ. 1.81 కోట్ల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థికంగా తోడ్పడే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మితిమీరిన అప్పులు చేయడం వల్ల ప్రస్తుతం కొన్ని హామీల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పు భారం మోపినప్పటికీ దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్ల వంటి హామీలు పూర్తిగా అమలు కాలేదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మహిళలు, రైతుల సంక్షేమం ప్రజాప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.