Let's talk: editor@tmv.in
పేదల జీవితాలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ భరోసా పింఛన్ : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

పేదల జీవితాలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ భరోసా పింఛన్ : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

FL-Sarat Babu
1 జనవరి, 2026

మునగచెర్లలో పెన్ష‌న్లు అందించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌, శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌), టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ‌

నందిగామ మండ‌లం : పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే అత్యంత సంతృప్తికరమైన సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అని ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌, శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌), టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ అన్నారు.

నందిగామ నియోజ‌క‌వ‌ర్గం నందిగామ మండ‌లం మున‌గ‌చెర్ల గ్రామంలో బుధ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌, శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌), టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ ఇంటింటికి వెళ్లి ల‌బ్ధిదారుల‌కు పించ‌న్లు పంపిణీ చేశారు. ప్ర‌జ‌ల యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని వారంద‌రికీ నూత‌న సంవత్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేద‌లకు ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల్లో ఏమైనా ఇబ్బందులు వున్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుంటుంద‌న్నారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా ఒక రోజు ముందుగానే పించ‌న్లు పంపిణీ చేయ‌టం పై రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు.

ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌, శ్రీరాం రాజ‌గోపాల్, టిడిపి జిల్లా అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు దిశా నిర్ధేశంలో ప్ర‌తి పెన్ష‌న్ దారుడికి పెన్ష‌న్ అంద‌టంతో వారిలో ఆర్థిక భ‌రోసా పెరిగింద‌న్నారు. ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మున‌గ‌చెర్ల గ్రామ స‌ర్పంచ్ పొంగులూరి న‌ర‌సింహారావు, కృష్ణా మిల్క్ యూనియ‌న్ చైర్మ‌న్ చ‌ల‌సాని ఆంజ‌నేయులు, కంచిక‌చ‌ర్ల మార్కెట్ వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ కోగంటి బాబు, నందిగామ మున్సిపాలిటీ చైర్మ‌న్ మండ‌వ కృష్ణ కుమారి, నందిగామ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడు బచ్చుల సుబ్ర‌హ్మ‌ణ్య బోసు, నందిగామ రూర‌ల్ మండ‌లం పార్టీ అద్య‌క్షుడు వీరంకి వీర‌స్వామి, రాష్ట్ర క‌మ్మ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ స‌జ్జ అజేయ్, ఎన్టీఆర్ జిల్లా సోష‌ల మీడియా కో-ఆర్డినేట‌ర్ చిరుమామిళ్ల కృష్ణ‌మున‌గ‌చెర్ల పాల కేంద్రం అధ్య‌క్షుడు కల్లూరి నాగేశ్వ‌రారావు, పాల‌కేంద్రం డైరెక్ట‌ర్ న‌డికుడితి నాగేశ్వ‌ర‌రావు ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు.

పేదల జీవితాలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ భరోసా పింఛన్ : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) - Tholi Paluku