
పేదల ఆశాజ్యోతి బాలయోగి
FL - SIMHCLM
2 అక్టోబర్, 2025
దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా.. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆయన సేవలను సర్మించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలసి బాలయోగి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. బాలయోగి కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపిందన్నారు. కోనసీమలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి లోక్ సభ స్పీకర్ గా ఆ పదవికే వన్నెతెచ్చిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల బంధువు, స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగి గారని ఈ సందర్భంగా గుర్తు చేసారు.
