Let's talk: editor@tmv.in
పేదలకు రూ. 25 లక్షల ఆరోగ్య బీమా

పేదలకు రూ. 25 లక్షల ఆరోగ్య బీమా

FL - SIMHCLM
2 అక్టోబర్, 2025

రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధిపరచడమే తన లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పేదలకు ఆరోగ్య భరోసా ఇస్తున్నామని, సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవన స్థితిగతులను మారుస్తున్నామని అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో అయన పెన్షన్ల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అయన బహిరంగ సభలో మాట్లాడారు. ఇంకా అయన ఏమన్నారంటే దీపావళికి ముందే 3 లక్షల గృహప్రవేశాలు చేయిస్తాం. సూపర్ జీఎస్టీ వల్ల వినియోగదారులు పొదుపు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. నిత్యావసర వస్తువులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు వెసులుబాటు కలుగుతుంది.' అన్నారు.. జీఎస్టీలో ప్రస్తుతం 5, 18 శాతంతో రెండు శ్లాబులే ఉన్నాయని, ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నా ప్రజలకు లబ్ది కలుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వ సమర్ధ పాలనలో అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నామని, అంటూ దీనివల్ల దత్తి గ్రామంలో ఒక్కో కుటుంబానికి రూ.2.20 లక్షల లబ్ది కలిగిందని అన్నారు..

గత వైయస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ పై రూ.32 వేల కోట్ల భారం వేశారని, ట్రూ అప్ ద్వారా బిల్లుల్లో వసూలు చేసారని ఆరోపిస్తూ ఇప్పుడు సమర్ధ నిర్వహణ వల్ల ట్రూ డౌన్ చేసి ఛార్జీలను తగ్గిస్తున్నామన్నారు. ఈ తగ్గింపు నవంబరు నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు.. భవిష్యత్తులోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ హామీ ఇచ్చారు. ఇళ్లపైన సోలార్ రూఫ్ టాప్, పొలాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. బీసీలకు 3 కిలోవాట్ల వరకూ రూ.98 వేల వరకూ సబ్సీడీ ఇస్తున్నా అని వివరించారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టి రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులూ పూర్తిచేస్తామన్నారు. 25 ఏళ్లు అయినా పూర్తి కాని తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు సీఎం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడినట్లు చెబుతూ దానికి కేంద్రం రూ. 11 వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చిందన్నారు. అనకాపల్లి దగ్గర ఆర్సెలార్ మిట్టల్ సంస్థ రూ.1లక్ష కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని, చెబుతూ భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా విజయనగరం ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది అన్నారు. గత పాలకులు వస్తే చాలు పరదాలు కట్టేవారు, చెట్లు నరికేసేవారు. పోలీసులు అడ్డం పడేవాళ్లు, గోతులు తవ్వేవాళ్లు.ప్రజలు హాయిగా నవ్వుకోడానికి, మాట్లాడుకోడానికి కూడా వీల్లేగుండా చేశారు. ఇప్పుడు అలాంటి వేధింపులు ఏమీ లేవు. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజలకు మళ్లీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు వచ్చాయి రాజకీయ కక్షతో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ ప్రదేశాన్ని గత పాలకులు మార్చేశారు. కానీ నేను ఆ పని చేయబోనని సీఎం స్పష్టం చేశారు.

ఈ ట్రైబల్ యూనివర్సిటీకి సమీపంలోనే త్వరలో గ్రేహౌండ్స్ క్యాంపస్ వస్తుంది. మామూలు కార్యకర్తలను పార్లమెంటు సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన పార్టీ టీడీపీనే ప్రజలకు సేవలందించేందుకే నా జీవితం అంకితం చేశాను. అన్నదానం, ప్రాణదాన కార్యక్రమాలను టీటీడీ ట్రస్టు ద్వారా చేయించాలని కోరానని తెలియజేశారు

రాష్ట్రం, దేశంలోనూ 5 వేల పైచిలుకు దేవాలయాలను నిర్మించాలని టీటీడీని కోరాను.' అన్నారు. ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం చేపట్టాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా గత పాలకులు ఆలస్యం చేశారు. 2026 ఆగస్టుకు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం. ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

పేదలకు రూ. 25 లక్షల ఆరోగ్య బీమా - Tholi Paluku