Let's talk: editor@tmv.in
పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించడం అన్యాయం: వైసీపీ నేత దేవినేని అవినాష్

పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించడం అన్యాయం: వైసీపీ నేత దేవినేని అవినాష్

Gaddamidi Naveen
14 జులై, 2026

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరి పేట నివాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు. గత 32 సంవత్సరాలుగా అక్కడి రైల్వే భూముల్లో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న పేద కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని, రైల్వే అధికారులు చేపడుతున్న ఇళ్ల తొలగింపు చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తన అధికారిక 'ఎక్స్' వేదికగా స్పందించారు. మూడు దశాబ్దాలకు పైగా ఒకే చోట నివాసం ఉంటున్న పేద కుటుంబాలను ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా ఉన్నఫళంగా ఖాళీ చేయించడం అత్యంత అన్యాయమని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై వెంటనే స్పందించి, అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని, రైల్వే అధికారుల తొలగింపు చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నిరసన ధర్నాలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎండి. రూహుల్లా, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని బాధితులకు తమ పూర్తి మద్దతును ప్రకటించారు.

ట్యాగ్‌లు
VijayawadaRajarajeswariPetaOldRRPetaRailwayLandIssueHousingRightsSaveResidentsYSRCPDevineniAvinashVelampalliSrinivasAndhraPradeshVijayawadaNews
పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించడం అన్యాయం: వైసీపీ నేత దేవినేని అవినాష్ - Tholi Paluku