
పెందుర్తిలో దారుణం: కుర్చీకి కట్టేసి అత్తను హత్యా చేసిన కోడలు
కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థల విషయంలో అత్త తరచుగా జోక్యం చేసుకుంటుండటంతో ఆగ్రహం చెందిన ఓ కోడలు దారుణానికి ఒడిగట్టింది. తన అత్తను కుర్చీకి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య హత్య చేసింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అప్పన్నపాలెం లో చోటుచేసుకుంది.ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు, జయంతి కనక మహాలక్ష్మి (63), తీవ్రమైన కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. మృతురాలి కుమారుడు, 36 ఏళ్ల పూజారి జయంతి సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిరంతర కుటుంబ కలహాలు, అత్తమామల జోక్యంపై కోపంతోనే తన భార్య ఈ హత్య చేసిందని సుబ్రమణ్యం తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల విచారణలో నిందితురాలు లలితా దేవి పలు విషయాలను వెల్లడించింది. పెళ్లయిన నాటి నుంచి తనను అత్తమామలు మానసికంగా వేధించేవారని ముఖ్యంగా ఇంటి పనులు, శుభ్రత విషయంలో తరచుగా గొడవలు జరిగేవని ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమె నవంబర్ 6వ తేదీ సాయంత్రం గోశాల జంక్షన్ వద్ద కారు కోసం అని చెప్పి పెట్రోల్‌ను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంది.
మరుసటి రోజు ఉదయం, భర్త సుబ్రమణ్యం, మేనల్లుడు సంగీసప్పు శరత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత, లలితా దేవి తన ప్రణాళికను అమలు చేసింది. ఆమె తన పిల్లలకు 'దొంగ-పోలీస్' ఆట ఆడుకుందామని చెప్పి, అందులో భాగంగా తన అత్త కనక మహాలక్ష్మికి కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టివేసింది. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ దారుణాన్ని చూసి, మంటల్లో కాలిపోతున్న తన అమ్మమ్మను రక్షించడానికి ప్రయత్నించిన మృతురాలి మనవరాలు, 8 ఏళ్ల శ్రీనయనకు కాలిన గాయాలు కావడంతో . వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా కుటుంబంలో సుబ్రమణ్యం, లలితా దేవి, వారి పిల్లలు ఈశ్వర్ చంద్ర (10), శ్రీనయన, మృతురాలు, బంధువు అక్కెళ్ల ఛాయాదేవి, మేనల్లుడు శరత్ సహా మొత్తం ఎనిమిది మంది నివసిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత నిందితురాలు లలితా దేవి శనివారం నాడు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి, నేరాన్ని అంగీకరించింది. దింతో ఆమెను అదుపులోకి తీసుకున్న పెందుర్తి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నం. 495/2025 ను బీఎన్ఎస్ సెక్షన్ 103 కింద నమోదు చేశారు.
