Let's talk: editor@tmv.in
పీఎం సూర్యఘర్ కనెక్షన్లను వేగవంతం చేయండి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

పీఎం సూర్యఘర్ కనెక్షన్లను వేగవంతం చేయండి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Panthagani Anusha
28 మార్చి, 2026

రాష్ట్రంలో విద్యుత్ శాఖలో చేపట్టిన పథకాల పనులను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. ఆయన అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి డిస్కంల్ సీఈఓ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్‌ఎస్, పీఎం కుసుమ్ పథకాల పురోగతిని సమీక్షించారు.

మంత్రి ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా అందిస్తున్న పీఎం సూర్యఘర్ సోలార్ కనెక్షన్లపై దృష్టి సారించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వరకు ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని హచ్చాత్తుగా సూచించారు. ఈ లక్ష్య సాధన కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వచ్చే వ్యవసాయ సీజన్‌కు ముందే మంజూరు చేయాలని మంత్రి సూచించారు. అదేవిధంగా రైతుల విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం, ప్రజలకు అదనపు భారం లేకుండా విద్యుత్ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రజల కోసం సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.