
పీఎం-సేతు పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
దేశంలో యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతకు ఊతమిచ్చే దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రూ.62 వేల కోట్లకు పైగా విలువైన పలు యువత, కేంద్రీకృత కార్యక్రమాలను ఆవిష్కరించారు. శనివారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’లో పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి మోదీ రూ. 62,000 కోట్లకు పైగా విలువైన యువత-కేంద్రీకృత కార్యక్రమాలను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి రూ. 62వేల కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రాయోజిత పథకం అయిన పీఎం సేతు అడ్వాన్స్‌డ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం, ఉపాధి పరివర్తనను ప్రారంభించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను 200 హబ్ ఐటీఐలు, 800 స్పోక్ ఐటీఐలతో కూడిన హబ్-అండ్-స్పోక్ మోడల్‌గా అప్‌గ్రేడ్ చేస్తారు. ప్రతి హబ్ సగటున నాలుగు స్పోక్‌లకు అనుసంధానించి అధునాతన మౌలిక సదుపాయాలు, ఆధునిక ట్రేడ్‌లు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్‌లు, ఇంక్యుబేటర్ సౌకర్యాలతో కూడిన క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తారు.
గ్రాడ్యుయేట్లకు భత్యం
ప్రధాన మంత్రి మోడీ బీహార్‌లో ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ ప్రభుత్య పథకాన్ని కూడా ప్రారంభించారు. దీని కింద ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్లకు రెండేళ్లపాటు నెలకు రూ. వెయ్యి భత్యం అందించడం జరుగుతుంది. పరిశ్రమ ఆధారిత కోర్సులు, వృత్తి విద్యను ప్రోత్సహించడానికి బీహార్‌లోని జన్ నాయక్ కర్పురి ఠాకూర్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. బీహార్‌లోని నాలుగు విశ్వవిద్యాలయాలలో కొత్త విద్య, పరిశోధన సౌకర్యాలకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. బీహార్‌లో ఎన్ఐటి పాట్నా కొత్త క్యాంపస్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు.
10లక్షల ఉద్యోగాలు
గత పదేళ్లలో తమ ప్రభుత్వం 4వేల ఐటీఐలను ఆధునీకరించిందని ప్రధాని మోడీ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై యువత ఫోకస్ పెట్టాలన్నారు. యువతకు ఎంతో శక్తి ఉందని, దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జీఎస్టీ సంస్కరణల లాభాలు కూడా బిహార్ యువతకే ఎక్కువగా అందుతున్నాయన్నారు. గత రెండు దశాబ్దాలలో, బీహార్ ప్రభుత్వం 50 లక్షల మంది యువతను ఉపాధితో అనుసంధానించిందని, బీహార్ యువతకు దాదాపు 10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
ప్రధాని మోడీ చేతుల మీదుగా ఐటీఐ టాపర్లకు సర్టిఫికెట్లు అందజేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐ టాపర్ల కోసం నైపుణ్య స్నాతకోత్సవాన్ని నిర్వహించడం గొప్ప ఆనందదాయకమని, ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థులకు, బాలికలకు సర్టిఫికెట్లను అందజేయడంపై ఆనందం వ్యక్తం చేశారు
మోడీ ప్రారంభించిన ముఖ్య పథకాలు
పీఎం-సేతు పథకంలో రూ. 60వేల కోట్ల పెట్టుబడి. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐలు అనేది రూ. 60వేల కోట్ల పెట్టుబడితో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకం. దేశవ్యాప్తంగా వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 200 హబ్ ఐటీఐలు, 800 స్పోక్ ఐటీఐలతో కూడిన 'హబ్-అండ్-స్పోక్' నమూనాలో పనిచేస్తుంది. ఈ క్లస్టర్లను 'యాంకర్ ఇండస్ట్రీ పార్టనర్స్' నిర్వహిస్తాయి. తద్వారా మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్య శిక్షణను అందిస్తాయి. ఐటీఐల పర్యవేక్షణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ, నిర్వహణ పరిశ్రమల భాగస్వామ్యంతో ఉంటుంది. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించారు. ఐటీ, ఆటోమోటివ్, అగ్రికల్చర్ వంటి 12 అధిక డిమాండ్ రంగాలలో శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం.
ఉచిత నైపుణ్య శిక్షణ
ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయతా భత్తా యోజనలో ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు రెండు సంవత్సరాల పాటు నెలకు వెయ్యి చొప్పున భత్యం లభిస్తుంది. బీహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకంలో ఉన్నత విద్య కోసం రూ. 4 లక్షల వరకు పూర్తిగా వడ్డీ లేని విద్యా రుణాలను అందిస్తుంది.
యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు పీఎం-ఉషా కింద పాట్నా యూనివర్సిటీ సహా బీహార్‌లోని నాలుగు యూనివర్సిటీలలో కొత్త విద్యా, పరిశోధనా సౌకర్యాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
6,500 మంది విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం గల ఎన్‌ఐటీ పాట్నా బితా క్యాంపస్‌ను ప్రధాని దేశానికి అంకితం చేశారు. బీహార్ ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన 4వేల మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని నియామక పత్రాలను పంపిణీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి బాలక్, బాలికా స్కాలర్‌షిప్ పథకం కింద 9, 10 తరగతులు చదువుతున్న 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 450 కోట్ల స్కాలర్‌షిప్‌లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా విడుదల చేశారు.
