
పిల్లల్లో ఆర్థిక అవగాహనకు నూతన దారులు…లిటిల్ ఫ్యూచర్ ఫౌండర్స్
మన దేశంలో పెద్దల్లో ఆర్థిక అవగాహన చాలా తక్కువ. కేవలం 27 శాతం మందికే డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చు చేయాలి? ఎలా పొదుపు చేయాలి? అనే విషయాలు స్పష్టంగా తెలుసు అనే విషయాన్ని జాతీయ ఆర్థిక విద్యా మండలి వెల్లడించింది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే డబ్బు విలువ, పొదుపు, ఖర్చులపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో లిటిల్ ఫ్యూచర్ ఫౌండర్స్ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా పిల్లలకు తొందరగా అర్థమయ్యే విధంగా ఒక పుస్తకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రసిద్ధ విద్యావేత్త, బాలసాహిత్య రచయిత సోనియా అగర్వాల్ రచించిన ఈ పుస్తకాలు భారీ ఆదరణ పొందడమే కాక ఇప్పటివరకు 40,000 కంటే ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోవడం విశేషం.
కథలతో పాటు గణిత ఆధారిత యాక్టివిటీ ఆధారంగా ప్రచురణలోకి తీసుకువచ్చిన ఈ పుస్తకాలు, బోర్డ్ గేమ్స్, పజిల్‌లు, స్టార్ట్‌అప్ కిట్స్ ద్వారా పిల్లల్లో వ్యాపార భావన, ఆర్థిక నియంత్రణ పట్ల అవగాహన పెంపొందిస్తాయని,అదే తమ ఈ కార్యక్రమం లక్ష్యం అని పేర్కొంది. పిల్లల బుద్ధి వికాసం పట్ల హోవర్డ్ గార్డ్‌నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ సిద్ధాంతం ఆధారంగా ప్లేవే లెర్నింగ్ పద్ధతులు ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపొందించబడినట్లు సంస్థ తెలిపింది. పిల్లలు క్లిష్టమైన ఆర్థిక భావనలను ఆడుకుంటూ, ఆనందంగా అర్థం చేసుకునేలా తీర్చిదిద్దటం విశేషం.
ఇక ఈ విషయమై సోనియా “ఆర్థిక విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అందాలి, అది ప్రత్యేక వర్గాలకే పరిమితం కాకూడదు. ఆటల ద్వారా సరదాగా నేర్చుకోవాలి మా కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి,” అని సోనియా తెలిపారు.
అదేవిదంగా భవిష్యత్‌లో సంస్థ రూపొందించిన పుస్తకాలు, సామగ్రిని అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలన్నది సంస్థ లక్ష్యం. పాఠశాలలు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వ సంస్థలతో కలిసి ఆర్థిక విద్యను సాధారణ పాఠ్యాంశాల్లో భాగం చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, జాతీయ ఆర్థిక విద్యా మండలి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.
అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం విస్తరించేందుకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
డబ్బు విలువ తెలుసుకునే పిల్లలు… సరైన నిర్ణయాలు తీసుకునే పెద్దలుగా ఎదగడమే
లిటిల్ ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రధాన లక్ష్యం. ఆసక్తికరమైన పుస్తకాలు, ఆటలు, కథల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం, ఆలోచన, నిర్ణయ సామర్థ్యాలు పెరుగుతాయని సంస్థ వెల్లడించింది
హోవర్డ్ గార్డ్‌నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటే ఏమిటి
హోవర్డ్ గార్డ్‌నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటే, ప్రతి వ్యక్తికి ఒక్క రకమైన నైపుణ్యం మాత్రమే ఉండదు. అందరిలోనూ వేర్వేరు రకాల నైపుణ్యాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి తన ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు, సమస్యలను పరిష్కరిస్తాడు.
గార్డ్‌నర్ పేర్కొన్న ఎనిమిది రకాల నైపుణ్యాలు:
భాషా నైపుణ్యం – మాటల ద్వారా భావాలు వ్యక్తం చేయడం, చదవడం, రాయడం.
తర్క, గణిత నైపుణ్యం – సమస్యలు పరిష్కరించడం, సంఖ్యలను, లాజిక్‌ను అర్థం చేసుకోవడం.
సంగీత నైపుణ్యం – సంగీతాన్ని గ్రహించడం, పాడడం, స్వరాలను సృష్టించడం.
శారీరక నైపుణ్యం – శారీరక కదలికలు, నైపుణ్యాలను ఉపయోగించడం.
స్థల నైపుణ్యం – దిశ, ఆకారాలు, స్థలాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం.
సాంఘిక నైపుణ్యం – ఇతరుల భావాలు, అవసరాలు తెలుసుకోవడం, సమాజంలో సవ్యంగా వ్యవహరించడం.
ఆత్మ అవగాహన నైపుణ్యం – మనిషి భావాలు, లక్ష్యాలు చేసుకోవడం.
ప్రకృతి నైపుణ్యం – పసుపు, జంతువులు, వృక్షాలు, ప్రకృతిని అర్థం చేసుకోవడం.
ఈ సిద్ధాంతం ప్రకారం, విద్యార్ధుల బోధనలో అన్ని రకాల నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని పాఠ్య విధానాలను రూపొందించడం అవసరం. దీనివల్ల ప్రతి విద్యార్ధి తన ప్రత్యేక సామర్థ్యాలను మెరుగుపరుచుకొని, సృజనాత్మకంగా అభివృద్ధి చెందగలుగుతాడు.
