
పాతబస్తీలో మాదకద్రవ్య–లైంగిక దాడులపై బాధిత తల్లిదండ్రుల ఆవేదన
హైదరాబాద్ పాతబస్తీలో మాదకద్రవ్యాలకు అలవాటు చేసి చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని బాధిత బాలికల తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు.బాధితుల తల్లిదండ్రులు ఆదిల్ అలియాస్ అజీజ్ అనే వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్న స్థానిక గ్యాంగ్ తమ కుమార్తెలను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి పలుమార్లు దారుణాలకు పాల్పడిందని వారు తెలిపారు.
బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్,ఆధ్వర్యంలో బాధితుల తల్లిదండ్రులు మాట్టాడుతూ..మా చిన్నారులను మాదకద్రవ్యాలతో మత్తులోకి నెట్టి,నిరంతరం దుర్వినియోగం చేశారు.సీసీటీవీ ఫుటేజ్‌లలోనూ ఆ నిందితులు బాలికను డ్రగ్స్ కోసం తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయని.ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా,అజీజ్ మళ్లీ అడ్డగించి స్కూటర్‌పై బలవంతంగా తీసుకెళ్లాడు,మేము ఆపలేకపోయాం అని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
వారిపై పదేపదే ఫిర్యాదులు చేసినా,పోలీసులు ఇప్పటివరకు సరైన విచారణ చేయలేదని వారు ఆరోపించారు.మాదకద్రవ్య వినియోగం,లైంగిక దాడి అంశాలపై దర్యాప్తు జరగలేదని తెలిపారు.ప్రస్తుతం ఆ బాలిక భరోసా సెంటర్‌లో చికిత్స సహాయం పొందుతుండగా,ఆమె మానసికంగా తీవ్రంగా కుంగిపోయిందని వారు చెప్పారు.ఈ డ్రగ్ గ్యాంగ్ పాతబస్తీలోని ఒక పాఠశాలను లక్ష్యంగా చేసుకుందని.అక్కడ హిందూ బాలికలు ఎక్కువగా చదువుతున్నారని అయినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క నిందితుడిపై చర్య తీసుకోలేదు అని తల్లిదండ్రులు ఆరోపించారు.తమ కుమార్తెలకు న్యాయం జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని,ఈ కేసులో పోలీసు అధికారులు,ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘోర సంఘటనపై స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.బాధిత బాలికలకు న్యాయం చేయాలని,డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
లైంగిక దాడుల ముఠా పై బండి సంజయ్ తీవ్ర ఆందోళన
పాతబస్తీలో మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల ద్వారా లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడంపై బండి సంజయ్ తీవ్రగా ఖండించారు.ఈ ముఠా,పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన హిందూ బాలికలనుప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు బండి ఆరోపణలు చేశారు.
డ్రగ్స్‌కి బానిసలుగా మార్చే వల
ఆదిల్ అలియాస్ అజీజ్ నేతృత్వంలోని స్థానిక గ్యాంగ్ ఈ మైనర్ బాలికలను చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ఇవ్వడం ద్వారా మత్తుకు బానిసలుగా మార్చుతోందని మొదట తక్కువ మోతాదుతో డ్రగ్స్ కలిపిన చాక్లెట్లు ఇచ్చి, క్రమంగా మోతాదును పెంచుతూ వారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెస్తున్నట్లు బండి తెలిపారు.ఈ విధంగా మత్తుకు గురైన బాలికలను గ్యాంగ్ సభ్యులు కిడ్నాప్ చేసి పలుమార్లు లైంగిక దాడులకు గురిచేస్తున్నారని దారుణాల దృశ్యాలను వీడియో,ఫోటో రూపంలో చిత్రీకరించి,ఆ బాలికలను బ్లాక్‌మెయిల్ చేస్తూ మరిన్ని మైనర్ బాలికలను తమ వలలోకి దింపేందుకు బలవంతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పోలీసులు,ఎంఐఎంపై సంచలన ఆరోపణలు
తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినా,స్థానిక పోలీసులు దర్యాప్తు చేయకపోగా,కొందరు పోలీసులు ఇలాంటి ఘటనలు సాధారణం అని నిర్లక్ష్యంగా స్పందించారని బండి ఆరోపించారు.మీ ఇంట్లో మహిళలను జరుగుతే ఇలానే చూస్తూ ఊరుకుంటారా అని బండి ప్రశ్నించారు.కేసులు నమోదు చేసినా,బాలిక తిరిగి వచ్చిన వెంటనే మూసివేయడం,పోలీసులు గ్యాంగ్‌తో కుమ్మక్కై ఉన్నారనే అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు.ఈ ముఠాకు రాజకీయ మద్దతు లభిస్తోందన్న ఆరోపణలూ వెలువడుతున్నాయి.స్థానికంగా పోలీసు బదిలీలపై ప్రభావం చూపడం,నిందితులను విడుదల చేయించడంలో జోక్యం చేసుకోవడం వంటి చర్యలతో మజ్లిస్ పార్టీపై కూడా ఆరోపణలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.అలాగే ఇది ది కేరళ ఫైల్స్ సినిమాలో ఎలా జరిగాయో చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయని, ప్రభుత్వం చర్యలు తిసుకోకాపోతే హిందూ సమాజం కోసం పాతబస్తీలో హిందూ యువకులతో కవాత్ నిర్వహిస్తామని బండి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో,బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని,లేకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.పాతబస్తీకి పరిమితమైన ఈ ప్రమాదం నిర్లక్ష్యం చేస్తే, అది త్వరలోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని బండి సంజయ్ హెచ్చరించారు.
