Let's talk: editor@tmv.in
‘పాస్ బుక్ లైట్’ను తీసుకొచ్చిన ఈపీఎఫ్​ఓ

‘పాస్ బుక్ లైట్’ను తీసుకొచ్చిన ఈపీఎఫ్​ఓ

FL - BRTH
19 సెప్టెంబర్, 2025

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్వో 3.0 సంస్కరణల్లో భాగంగా పాస్ బుక్ లైట్ ను తీసుకొచ్చింది. ఉద్యోగులు ఉద్యోగాలు మారేటప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను మార్చుకోవడానికి సులభతరంగా ఉండేందుకు పాస్ బుల్ లైట్ ను ప్రవేశపెట్టింది. పాస్ బుక్ లైట్ ఆప్షన్ ద్వార ప్రస్తుతం అకౌంట్ లో ఉన్న నగదు, విత్ డ్రా చేసుకున్న నగదు, ఇతర లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా పొందవచ్చు. ఇందుకోసం పాస్ బుక్ పోర్టల్ ను తెరవాల్సిన అవసరం లేదు. నేరుగా పాస్ బుక్ లైట్ ద్వార సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పాస్ బుక్ లైట్ ను తీసుకురావడం ద్వార ప్రస్తుతం ఉన్న పాస్ బుక్ పోర్టల్ పై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుందని, అదే సమయంలో పూర్తీ స్థాయి సమాచారం తెలుసుకోవడానికి ఇప్పటికే ఉన్న పాస్ బుక్ పోర్టల్ ను కూడా ఉపయోగించవచ్చని కార్మిక, ఉపాధి శాఖా మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఒకేసారి లాగిన్ అవ్వడం ద్వార అన్ని రకాల ముఖ్యమైన సేవలు అందిస్తూ, ఫిర్యాదులు తగ్గిస్తూ పారదర్శకతను మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పిఎఫ్ సభ్యులు సేవల కోసం, లావాదేవీల తనిఖీ కోసం వేరు వేరుగా లాగిన్ అవ్వాలి. ఇది పాస్ వర్డ్ సింక్రొనైజేషన్ సమస్యలకు దారితీస్తుంది. అదేసమయంలో ఈపీఎఫ్వో Annexure K ను ఆన్ లైన్ లో యాక్సిస్ చేయడానికి అవకాశం కల్పించింది. తద్వార ఉద్యోగం మారినప్పుడు ఉద్యోగులు తమ ఖాతాను మార్చుకోవచ్చు. వాటి స్థితిని తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్వో తీసుకున్న నిర్ణయాలను నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈపీఎఫ్వో విషయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్వో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని సమస్యలు వేగంగా పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. ఈపీఎఫ్వో తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘పాస్ బుక్ లైట్’ను తీసుకొచ్చిన ఈపీఎఫ్​ఓ - Tholi Paluku