Let's talk: editor@tmv.in
పాల ఉత్పత్తుల ధరలు తగ్గించిన మదర్ డైరీ

పాల ఉత్పత్తుల ధరలు తగ్గించిన మదర్ డైరీ

Pinjari Chand
17 సెప్టెంబర్, 2025

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులను సవరించడంతో ఆయా కంపెనీలు క్రమంగా ధరలు తగ్గిస్తున్నాయి. వినియోగదారులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు కార్ల, టూవీలర్, తదితర ఉత్పత్తుల కంపెనీలు ధరలను తగ్గించినట్లు ప్రకటించాయి. తాజాగా మదర్ డైరీ కూడా పాల ఉత్పత్తులపై ధరలను తగ్గించినట్లు మంగళవారం వివరించింది.

దేశంలోని పాల ఉత్పత్తిదారుల్లో మదర్ డైరీ ఒకటి. రోజుకు కోట్ల లీటర్ల పాలను సేకరించి వినియోగదారులకు అందిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో మదర్ డైరీ కూడా పాల ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. పాల నుంచి నెయ్యి వరకు జీఎస్టీకి అనుగుణంగా రేట్లను సవరించినట్లు డైరీ ప్రకటించింది.ఇటీవల కేంద్రం 12,28 స్లాబులను తొలగించింది. 5,18 స్లాబులు మాత్రమే ఉంటాయి.

ఈ కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాల ఉత్పత్తులు ఇంతకు ముందు 12 శాతం పన్ను స్లాబులో ఉండేవి.ప్రస్తుతం 5 శాతం స్లాబులోకి మార్చారు. ఈ తగ్గిన రేట్లను ప్రజలకు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. వస్తు ఉత్పత్తిని బట్టి రూ.2 నుంచి రూ.30 వరకు రేట్లు తగ్గనున్నాయి.

ఈ నిర్ణయంతో టోన్డ్ లీటర్ పాల ధర రూ.77 నుంచి రూ.75 వస్తుంది.పన్నీర్ 200 గ్రాముల ధర రూ.95 నుంచి 92కి రానుంది.తదితర ఉత్పత్తుల వివరాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని సూచించింది.