Let's talk: editor@tmv.in
ప‌ల్లెలో వేడెక్కిన రాజ‌కీయం

ప‌ల్లెలో వేడెక్కిన రాజ‌కీయం

Gaddamidi Naveen
4 డిసెంబర్, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. తొలి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో, ఎన్నికల సంఘం అధికారులు తదుపరి కీలక ప్రక్రియను పూర్తి చేశారు.బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సర్పంచ్ మరియు వార్డు మెంబర్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం జరిగింది.గుర్తుల కేటాయింపు పూర్తి కావడంతో, ఇక అభ్యర్థులు తమ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈ ఎన్నికల్లో యువకులు అధిక సంఖ్యలో పోటీలో ఉండటం గమనార్హం.మొదటి విడత ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో, గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.మొదటి విడత పోలింగ్ 11న ఉద‌యం 7నుంచి1గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభ‌మై అదేరోజు ఫ‌లితాలు వెల్ల‌డించానున్నారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. నామినేషన్ దాఖలు, పరిశీలన (స్క్రూటినీ), ఉపసంహరణ ప్రక్రియలను అధికారులు పూర్తి పారదర్శకంగా, నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ప్రతి పత్రాన్ని శ్రద్ధగా పరిశీలించారు.కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, సీసీ కెమెరా పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అభ్యర్థులు, ప్రతినిధులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప‌ల్లెలో వేడెక్కిన రాజ‌కీయం - Tholi Paluku