
పొల్యూషన్ కంట్రోల్ బోర్టులో ఖాళీలు భర్తీ చేయండి
పంజాబ్, హార్యానా, ఎన్సీఆర్ న్యూఢిల్లీ, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిపోతుంది. హాయిగా పీల్చుకుందామంటే ఇక్కడ స్వచ్ఛమైన గాలి కరువే. అందుకు చలికాలం రాకముందే కాలుష్య నియంత్రణ బోర్డులో ఉన్న ఖాళీలపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని, మూడు నెల్లల్లోగా ప్రణాళికలు రూపొందించాలని ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులను మందలించింది. అలాగే గాలిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోకా సమగ్రమైన ప్రణాళికలు సమర్పించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, కేంద్ర కాలుష్యనియంత్రణ మండలిలను ఛీప్ జస్టిస్ బీఆర్ గవాయ్, కే. వినోద్ లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది.
మళ్లీ అక్టోబర్ 8 న విచారణ
ఎయిర్ క్వాలిటీ కమిషన్ మేనేజ్ మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్దమైన సంస్థ.దీని లక్ష్యం ఆయా రాష్ట్రాల్లో గాలి నాణత్యను మెరుగుపరచడం. దీంతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే పదోన్నతికి సంబంధించిన అంశంలో మాత్రం ఆరు నెలల గడువునిచ్చింది.అక్టోబర్ 8 న విచారణకు రావాలని, అంతలోపు నియామకాలను చేపట్టాలని సూచించింది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు తీవ్రంగా విఫలమయ్యాయని, మానవ వనరుల కొరత పర్యావరణ సంక్షోభాన్ని మరింతగా పెంచుతుందని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. నాణ్యమైన గాలిని పీల్చడం అన్నది పౌరుల హక్కని, ఇది జీవించే హక్కులో భాగమని స్పష్టం చేసింది. అయితే పంజాబ్, హార్యానా,ఢిల్లీ, నోయిడా తదితర ప్రాంతాల్లో వాతావరణంలో గాలి కాలుష్యంగా తీవ్రంగా పెరిగిపోయింది. కనీసం పరిమాణంలో కూడా నాణ్యత లేకుండా పోయింది.అందుకే సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు.
