
పర్వత ప్రాంతాల ప్రజల రక్షణకు చర్యలు: కేరళ సీఎం
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పినరయ్ విజయన్ హై-రేంజ్ (పర్వత ప్రాంత) ప్రజలను ఉద్దేశించి బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వారి జీవనోపాధి, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన, ఆర్థిక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. కంజిరప్పల్లి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వయనాడ్ భూస్ఖలన బాధితుల పునరావాసంపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రతిపక్షం సహకరించకుండా తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తోందని విమర్శించారు.
వన్యప్రాణి సమస్యపై ఆందోళన
హిల్లీ ప్రాంతాల్లో మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణ తీవ్రమైన సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వైల్డ్‌లైఫ్ ప్రోటెక్షన్ యాక్ట్ –1972 అడ్డంకిగా ఉందని తెలిపారు. కేరళలో అడవి పందులను హానికర జంతువులుగా ప్రకటించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని, దీనివల్ల సమస్య మరింత క్లిష్టమైందని అన్నారు. వన్యప్రాణి దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెంచినట్లు తెలిపారు. పాము, తేనెటీగల దాడుల వంటి ఘటనల్లో మరణించిన వారికి రూ.4 లక్షల సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారికి కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
వయనాడ్ పునరావాసం
వయనాడ్ లోని ముండక్కై, చూరల్మల ప్రాంతాల్లో భూస్ఖలన బాధితుల కోసం టౌన్‌షిప్ ఏర్పాటు ప్రభుత్వం బలవంతంగా తీసుకురాలేదని, బాధితుల కోరిక మేరకే రూపుదిద్దుకుందని చెప్పారు. పునరావాసంపై ప్రతిపక్షం మొదట చర్చల్లో పాల్గొని తర్వాత వెనక్కి తగ్గిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి అంశాల్లో ప్రతిపక్షం చేసిన హామీలు అమలు కాలేదని ప్రశ్నించారు.
కీఐఐఎఫ్‌బీ, అవినీతి ఆరోపణలు
కేరళ ఇన్‌ఫ్రాస్‌టక్చర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ బోర్డుపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గత ఐదేళ్లలో రూ.62,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కేరళలో అవినీతి తక్కువగా ఉండటానికి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. అడవుల చుట్టూ బఫర్ జోన్ విషయంలో ప్రజల నివాస ప్రాంతాలను మినహాయించేలా సుప్రీం కోర్టు నుంచి అనుకూల తీర్పు సాధించామని తెలిపారు. రబ్బర్ రైతుల సమస్యలు కేంద్ర విధానాల వల్ల వచ్చాయని పేర్కొన్నారు. 2010లో అమల్లోకి వచ్చిన ఆసియన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం వల్ల దిగుమతులు పెరిగి రైతులు నష్టపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రబ్బర్ ధరను కిలోకు రూ.180 నుంచి రూ.200కు పెంచినట్లు తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధి
వెల్లూర్‌లో రూ.1,050 కోట్ల పెట్టుబడితో కేరళ రబ్బర్ లిమిటెడ్ ఏర్పాటు చేసి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ప్రజల అభివృద్ధి, సామాజిక న్యాయం రెండూ కలిసే కేరళలో అమలవుతున్నాయని సీఎం విజయన్ తెలిపారు.
