Let's talk: editor@tmv.in
పర్యాటక శాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ

పర్యాటక శాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ టీజీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి. గౌతమి శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కొత్త పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి పర్యాటకుల తాకిడిని పెంచేలా వినూత్న ప్రణాళికలతో ముందుకు సాగాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని లాభసాటిగా మార్చాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీతో రాష్ట్ర పర్యాటక శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది.