Let's talk: editor@tmv.in
పర్యటనల్ని వాయిదా వేసిన విజయ్

పర్యటనల్ని వాయిదా వేసిన విజయ్

Pinjari Chand
2 అక్టోబర్, 2025

తమిళవెట్రి కళగం(టీవీకే)పార్టీ తన ప్రచార ర్యాలీలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత పార్టీ చీఫ్,నటుడు విజయ్​ పార్టీ ముఖ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నజరిగిన పెను విషాదంలో దాదాపు 41 మంది మరణించారు. 90 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే ఈ అనుహ్య నిర్ణయం తీసుకుంది. ‘మా ప్రియమైన ప్రజలను కోల్పోయినందుకు మేం చాలా దు:ఖంలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో 14 రోజుల పాటు పార్టీ ప్రచార ర్యాలీలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని, మా నాయకుడి నిర్ణయాలను ప్రతినిత్యం మీతో పంచుకుంటామని ఎక్స్​ లో టీవీకే పోస్ట్​ చేసింది.

అలాగే త్వరలోనే బాధితులను కలుస్తానని, నా జీవితంలో ఇంతటి విషాదాన్ని ఎప్పుడు చూడలేదని, బాధని అనుభవించలేదని విజయ్​ అన్నారు. నన్ను చూడడానికి వచ్చి మీరుప్రాణాలు పొగొట్టుకోవడం నన్ను కలచి వేస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. సంఘటన జరిగిన తరువాత మీ వెంట లేకపోవడానికి కారణం.మళ్లీ నేను వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనేనని తెలిపారు. తొక్కిసలాట ఘటనలో పార్టీ కరూర్​ జిల్లా కార్యదర్శి మతియాజగన్, పట్టణ కార్యకర్త అయిన పౌన్​ రాజ్​ లను పోలీసులు అరెస్ట్​ చేసి అక్టోబర్ 14 వరకు జ్యూడిషియల్ కస్టడీకి పంపారు.

పర్యటనల్ని వాయిదా వేసిన విజయ్ - Tholi Paluku