
ప్రభాస్, ఎన్.టి.ఆర్ తర్వాత ఇప్పుడు తేజ సజ్జా
తొలిపలుకు, సినిమా, సెప్టెంబర్ 24:* మన తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది నటులు, ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తీశారు, ఎన్నో అద్బుతమైన రికార్డులను కూడా సృష్టించారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణం రాజు, కృష్ణ, చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జున ఇలా ఒక తరం వారు వరుస ఇండస్ట్రి హిట్ల రికార్డులతో వారి వారి సత్తాను చాటుకున్నారు. కానీ ఆ తర్వాతి యంగ్ జనరేషన్‌కి ప్రభాస్, మహేష్ బాబు, తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల దగ్గరికి వచ్చేసరికి లెక్కలు అన్నీ మారాయి. సీనియర్ హీరోల్లా రొటీన్‌గా కాకుండా, కాస్త భిన్నంగా లవ్ స్టోరీలని, మాస్ యాక్షన్ డ్రామాలు అంటూ ఒక కొత్త తరహా సినిమాలను తీసుకొచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా ఎవరి యాక్టింగ్ స్టైల్ వారు చూపించి ప్రేక్షకులని మెప్పించారు.
ఇక మన ప్రస్తుత తరం వారి దగ్గరకు వస్తే చాలా మంది కొత్త నటులు వచ్చారు వారు నాని, అడివి శేష్, సాయి దుర్గా తేజ్, కిరణ్ అబ్బవరం, విజయ్ దేవరకొండ, తేజ సజ్జా, విశ్వక సేన్ వంటి ఎందరో. అస్సలు తెలుగు సినిమాలోనే కొన్ని బారియర్‌లను బ్రేక్ చేసి ఒక కొత్త రకమైన తెలుగు సినిమా ఇండస్ట్రి రాబోతుందని వీరి ద్వారా తెలియజేశారు. బడా హీరోలు వాల్ల రెగ్యులర్ టెంప్లేట్‌లోని సినిమాలను తీస్తుంటే, ఇలా కొత్త హీరోలు, కొత్త కంటెంట్‌తో వచ్చి, అస్సలు ఊహకందని కొత్త టెంప్లేట్‌లతో మంచి సినిమాలని అందజేశారు. ప్రేక్షకులు కూడా ఇకపై పెద్ద హీరోలు కాదు, పెద్ద కంటెంట్ సినిమాల కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. దీనితో బడా హీరోలు కూడా వాల్ల ట్రాక్‌ను మార్చి యూనిక్ కాన్సెప్ట్‌లతో రావడం మొదలు పెట్టారు.
ఇక ‘బాహుబలి’ చిత్రం తరవాత దర్శకుడు రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. చిన్న, పెద్ద హీరోలు అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే పాన్ ఇండియా సినిమాలతో వచ్చి ఎవరి సత్తాని వారు నిరూపించుకుంటారు. అయితే మన చిత్రాలు కేవలం మన దేశంలోనే కాకుండా, ఓవర్సీస్‌లో అంటే ఇతర దేశాలలో కూడా విడుదల అవుతాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మన సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అక్కడి టికెట్ రేట్ల వల్ల సినిమా హిట్ అవుతేనే మన నిర్మాతలకి లాభం. ఎందుకంటే ఇలా ఓవర్సీస్‌లో ఇతర దేశ చిత్రాలను విడుదల చేయడానికి చాలా టాక్స్ కాస్ట్ అవుతుంది. అది రికవరీ జరగాలి అంటే జనాలు అక్కడి థియేటర్‌లకి రావాలి, అలా రావాలి అంటే మన సినిమాలో కంటెంట్ బాగుండాలి. లేదు అంటే పంపిణీదారులకి భారీ నష్టం వర్తిస్తుంది.
అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్‌సీస్‌లలో కూడా అదిరిపోయే రికార్డులు ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ ప్రభాస్, తారక్ మాత్రం వరుసగా 25 లక్షల డాలర్లు (రూ.22.54 కోట్ల) కలెక్షన్ వంటి కొత్త రికార్డుని సంపాదించారు. ఓవర్సీస్ కింగ్ అని పిలువబడే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తర్వాత, ఇతర దేశంలో ఇటువంటి రికార్డు వీరిద్దరికి మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఒక యంగ్ హీరో కూడా యాడ్ అయ్యారు. తను ఎవరో కాదు ‘నిన్ను చూడాలనివుంది’తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలయ్యి, ‘జాంబి రెడ్డి’, ‘హను-మాన్’, ‘మీరాయి’ చిత్రాలతో సుపరిచితమైన హీరో తేజ సజ్జా.
ఒకప్పుడు సీనియర్ హీరోల పక్కన చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన తన సినీ జీవితం, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్‌లాగా దూసుకెళ్లిపోతుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి తనదైన శైలిలో సినిమాలను తీస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ‘ఓ బేబీ’, ‘అద్బుతం’, ‘జాంబి రెడ్డి’ చిత్రాలతో నటించి, ప్రేక్షకులకి ఒక మంచి యాక్టర్ అవుతాడు అనే మార్కులని కొట్టేశాడు. ఇక ఆ తర్వాత 2024 సంక్రాంతికి ‘హను-మాన్’ అనే చిత్రంతో వచ్చి స్టార్ హీరోలకి సామానంగా కలెక్షన్‌లని కొల్లగొట్టి తన బాక్సాఫీస్ సత్తాని చాటుకున్నాడు.
లేటెస్ట్‌గా విడుదల అయిన ‘మీరాయి’ చిత్రంతో కూడా తన స్టామినా ఎంటో మళ్ళీ రుజువుచేసుకున్నాడు. ‘మీరాయి’ చిత్రం ఇప్పటికే రూ.134 కోట్ల కలెక్షన్‌లతో బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలని అందుకొని ముందుకి వెళ్తుంది. అలాగే ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం 25 లక్షల డాలర్లు ( రూ.22.54 కోట్ల) మార్క్ రికార్డుని సంపాదించుకొని, బడా హీరోలకి సమానంగా నిలుచున్నాడు హీరో తేజ సజ్జా. ఇక త్వరలో తాను చేయబోతున్న ‘జై హనుమాన్’, ‘జాంబి రెడ్డి-2’, ‘మీరాయి-2’, ఇంకా బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో దుమ్ముదులుపుతాయో వేచి చూడాల్సివుంది.
