
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వల్ల నష్టం
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ... విద్యార్ధి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమనికి శుక్రవారం విశాఖపట్నం, మద్దిలపాలెం , కృష్ణ కాలేజ్ రోడ్డు గల పార్టీ కార్యాలయం నుండి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె రాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కార్యాలయనికి వెళ్లి అక్కడి నుండి పార్టీ శ్రేణులుతో కలిసి భారీ ర్యాలీగా పాడేరు మెడికల్ కళాశాల వరకు వెళ్లి అక్కడ నిరసన తెలిపారు. పాడేరు మెడికల్ కళాశాల గురించి వాస్తవాలు ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసారు.
మీడియాతో కె.కె రాజు మాట్లాడతూ,మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలోనూ అత్యాధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందడుగు వేశారని, 5 కాలేజీలలో అడ్మిషన్లు ప్రారంభించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని, ప్రైవేటీకరణ వలన పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతారని అన్నారు. ఇప్పటికే 500 కోట్లతో మొదలుపెట్టిన పాడేరు మెడికల్ కళాశాల 70% పూర్తయిందని, 50 సీట్లతో క్లాసులు కూడా ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి అయిందని పేర్కొన్నారు. పేదవారికి ఉపయోగపడే విధంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటికరణను వెనక్కి తీసుకోవాలని లేదంటే పోరాటం ఇంకా ఉదృతం చేస్తామని తెలిపారు
ఈ కార్యక్రమాలో అల్లూరి సీతారామ రాజు జిల్లా అధ్యక్షులు, పాడేరు శాసన సభ్యులు మత్స్యరస విశ్వేశ్వర రాజు, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర , అరకు పార్లమెంటు సభ్యులు గుమ్మ తనూజరాణి, మాజీ పార్లమెంటు సభ్యులు గోద్దేటి మాధవి, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదిప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు , తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , మాజీ శాసన సభ్యులు కొట్టగల భాగ్య లక్ష్మి , చెట్టి పల్గున్, చింతలపూడి వెంకట రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధి , రాష్ట్ర అనుబంధ విభాగల అధ్యక్షులు పేర్ల విజయ చంద్ర , జాన్ వెస్లీ, మాజీ చైర్మన్ శోభ స్వాతి యశ్వంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు
