Let's talk: editor@tmv.in
ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచి ‘రోజుకో బహుమతి’

ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచి ‘రోజుకో బహుమతి’

Pinjari Chand
15 సెప్టెంబర్, 2025

దేశప్రదాని నరేంద్రమోదీ పుట్టినరోజు అయిన సెప్టెంబర్​ 17 నుంచి అక్టోబర్​ 2 వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపటనున్నారు. రోజుకో అభివృద్ధి ప్రాజెక్ట్ చొప్పున 15 ప్రాజెక్టులు చేపడతామని సీఎం రేఖ గుప్తా వివరించారు. అందులో భాగంగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ఉంటాయని ఇందుకోసం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖ గుప్తా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ వీరేంద్ర సచ్​ దేవ్​ లు ముమ్మరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని 75 వ పుట్టిన రోజు సందర్భంగా త్యాగరాజు స్టేడియంలో హోం మంత్రి అమిత్​ షా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

మొదటి రోజు కార్యక్రమ ప్రారంభం తరువాత కర్తవ్య పథ్​ లో ‘థ్యాంక్​ యూ మోదీ జీ’ పేరుతో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఇందులో సుమారు 1000 యూనిట్ల రక్త సేకరణే లక్ష్యంగా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే మిగతా రోజుల్లో ప్రదర్శనలు, వైద్య శిబిరాలు, పర్యావరణ ప్రయోజనం కోసం చెట్లు నాటడం, అలాగే ఢిల్లీలో 150 డయాలసిస్​ కేంద్రాలు, కొత్త దవాఖానలు, 101 ఆరోగ్య కేంద్రాలు, జీవన్​ దాన్​ అవగాహన్ పోర్టల్​ ప్రారంభించనున్నారు. ఇలా ఢిల్లీ ప్రజలకు రోజుకో బహుమతి చొప్పున 15 రోజుల్లో ఈ పనులు చేపట్టనున్నారు.

ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచి ‘రోజుకో బహుమతి’ - Tholi Paluku