Let's talk: editor@tmv.in
ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే: సీఎం రేఖాగుప్తా

ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే: సీఎం రేఖాగుప్తా

Pinjari Chand
18 సెప్టెంబర్, 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రక్తదానం చేశారు. దేశవ్యాప్తంగా ‘సేవాసంకల్ప్ వాక్’నిర్వహించారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన సేవా సంకల్ప్ వాక్ లో పాల్గొన్నారు. ఆమెతో బాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్, మంజీందర్ సింగ్, బన్సూరి స్వరాజ్,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆయా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఢిల్లీ ప్రజలకు ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా 75 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా ఈ పథకాలు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడ కార్యక్రమం సందర్భంగా రోజుకో కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు. విద్యార్థులకు, మహిళలకు,యువతకు ఈ పథకాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఢిల్లీలో మౌలిక సదుపాయాల కోసం భారీ ఎత్తున వ్యయం చేస్తామని ఈ సందర్బంగా వివరించారు.

సీఎం రక్తదానం

సేవా పఖ్యాడా లో భాగంగా వేయి యూనిట్ల రక్త సేకరణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ లో మొదటగా సీఎం రేఖా గుప్తానే రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు రక్తదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మన ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే ధారబోయాలని పిలుపునిచ్చారు. దేశ సేవకు యువత ముందుకు రావాలని ఆకాంక్షించారు.

ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే: సీఎం రేఖాగుప్తా - Tholi Paluku