
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. దీని కింద ప్రతి కుటుంబానికి నగదు రహిత చికిత్సను అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘సీఎం హెల్త్ కార్డు’ ద్వారా ఈ ప్రయోజనాన్ని అందిస్తామని, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందన్నారు.
ఈ కార్డు కింద పంజాబ్ లోని ప్రతి పౌరుడు మెరుగైన చికిత్సను పొందుతారన్నారు. తరణ్,తరణ్,బర్నాల జిల్లాలో ప్రారంభిస్తామని, అక్కడ రెండు, మూడు రోజుల పాటు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే చాలా సులభమైన ప్రక్రియ అని పేర్కోన్నారు. ఆధార్, ఓటర్ కార్డు లేదా పాస్ పోర్ట్ తో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వివరించారు.
2000 వేల వ్యాధులకు ఉచిత చికిత్స సీఎం హెల్త్ కార్డు ద్వారా సుమారు 2 వేల వ్యాధులకు చికిత్సపొందవచ్చని ‘ఎక్స్’ లో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ మొదలవుతుందని, ప్రతి ఒక్కరికి ఈ కార్డులు అందిస్తామన్నారు. మెరుగైన చికిత్సను అందిస్తామని, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుసంధానిస్తామన్నారు.
వరద బాధితులకు మద్దతుగా ‘మిషన్ చార్డీకల’
చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు చూడని వరదలు పంజాబ్ ను అతలాకుతలం చేశాయని, ఎంతో మంది దీని వల్ల నిరాశ్రయులయ్యారని, వరద బాధితులకు మద్దతుగా వారికి పునరావాసం కల్పించేందుకు ‘మిషన్ చార్డీకల’ను సెప్టెంబర్ 17నే ప్రారంభించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశవాసులు, పంజాబ్ పౌరులు రాష్ట్ర అభివృద్దికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్ ప్రజలకు సహకరించాలని కోరారు.
ప్రాథమిక అంచనా ప్రకారం వరదల కారణంగా సుమారు రూ.13,800 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టేకొద్ది ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పంజాబ్ కు ఇది కష్టసమయం, అయితే ప్రతి ఒక్కరూ ఈ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. యువత ప్రాణాలకు తెగించి ఇతరులను రక్షించింది. ఇది పంజాబ్ ప్రజల సంకల్పం. ఈ భూమి గురువులు,అమరవీరులు, సహచరులదని, ధన్యమైనదని కొనియాడారు. పంజాబ్ లో పునరావాస చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ పౌరులు మందుకు రావాలన్నారు.
