Let's talk: editor@tmv.in
ప్రజా ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం

ప్రజా ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం

Gaddamidi Naveen
24 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు తీసుకుంటున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటుంద‌ని, ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని ముదిగొండ మండలంలో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఈ సంద‌ర్భంలో మాట్లాడారు. ప్రభుత్వానికి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దిశగా పెట్టే అనేక కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి భారం అవుతున్న అప్పులను తగ్గించేందుకు కృషి చేస్తూ, 11.5శాతం వడ్డీ రేటుతో తీసుకున్న అప్పులను 8శాతంకి తగ్గించి, రాష్ట్రానికి ఆర్థిక ఊరట కల్పించడంలో ప్రభుత్వం విజయవంతమైంద‌న్నారు.

అలాగే ఉద్యోగుల బకాయిలను క్రమంగా చెల్లిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల విశ్వాసాన్ని పేంచం,గ‌త ప్ర‌భుత్వంలో పేరుకుపోయిన రైతు రుణాల‌ను ఈ ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ, రూ.21 వేల కోట్ల రుణమాఫీ, రూ.9 వేల కోట్ల రైతు భరోసా పథకాలను అమలు చేశ‌య‌ని. ఇది వ్యవసాయ రంగానికి ఊపిరిగా మారుతుందన్నారు. గృహ నిర్మాణంలోనూ ప్రగతి కొనసాగుతూ, 5 లక్షల ఇళ్లు 'ఇందిరమ్మ ఇల్లు' పథకం కింద నిర్మించబడుతున్నాయ‌ని. గ్రామీణ వ్యవసాయానికి అవసరమైన 29 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించడంతో పాటు, గృహ‌జ్యోతి ప‌థ‌కం ద్వారా 51 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందించడమే కాకుండా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించడం ప్రభుత్వానికి భారీ ప్రశంసలు తీసుక‌వ‌చ్చింద‌న్నారు.

ప్రతీ మాధ్యత‌ర‌గ‌తి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా రూ.500కే గ్యాస్ సిలిండర్,ఒక్కొక్క‌రికి 6 కిలోల సన్నబియ్యం ఉచిత పంపిణీ వంటి పథకాలతో ప్రజా ప్రభుత్వం ప్రత్యక్ష లబ్ధిదారుల హృదయాలను గెలుచుకుంద‌ని తెలిపారు. ఉద్యోగ అవకాశాల పరంగా, ఇప్పటికే 56,000 ఉద్యోగాలు భర్తీ చేయగా, మరో 30,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నాయ‌ని. ఇది నిరుద్యోగ యువతకు విశ్వాసాన్ని కలిగిస్తోంద‌ని. అలాగే, మహిళా సంఘాలకు 21 వేల కోట్ల రుణాలు మంజూరు చేయడం, ఆర్థికంగా వాటిని సాధికారంగా మార్చే దిశగా తీసుకున్న పటిష్ట చర్యగా పేర్కొన్నారు.

అంతేకాక, విద్యారంగాన్ని నూతన దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో 'ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు' నిర్మాణం కొనసాగుతున్నాయ‌ని. ఇది గ్రామీణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు కీలకంగా మారుతుందన్నారు. మొత్తానికి, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు.ముదిగొండ గ్రామంలో 59.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబడింది.యడవల్లి గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయితీ భవనం నిర్మాణం ప్రారంభించారు.మాదాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మరియు అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రజా ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం - Tholi Paluku