Let's talk: editor@tmv.in
పద్య పాదూషా జాషువా: చింతలపాటి

పద్య పాదూషా జాషువా: చింతలపాటి

Venkatesh Balusula
29 సెప్టెంబర్, 2025

కవి కోకిల, పద్మ విభూషణ్ జాషువా పద్య పాదుషా అని సిరికవి, వాంజ్ఞ్మయి వ్యవస్థాపకులు డాక్ట‌ర్ చింతలపాటి మురళీకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో జాషువా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీకృష్ణ మాట్లాడుతూ జాతి, కుల, మతాలకు అతీతంగా తెలుగు పద్య శిల్పాన్ని మలచిన కవి శిఖామణులలో జాషువా అగ్రగామి అని అన్నారు. జాషువా తాను తీసుకున్న అంశాలను శిల్ప దృష్టితో రమణీయంగా తీర్చిదిద్ది చిరస్థాయిగా నిలిచారన్నారు. స్మశాన వాటికను వర్ణించినా, శిశువును తీర్చిదిద్దినా, రాజు-కవి వర్ణన చేసినా ఆయన ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. జాషువా రచనలలోని పద్యాలను పాడి వినిపించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సాహితీ మిత్రులు, అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ సమాజానికి దిశా నిర్దేశం చేసి సక్రమ మార్గంలో నడిపించేది కవులు, రచయితలేనన్నారు. పరిషత్ అధ్యక్షుడు కార్మూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జాషువా రచనల్లో ఆధ్యాత్మిక భావం కూడా గోచరిస్తుందన్నారు. తొలుత జాషువా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ, పరిషత్ కార్యదర్శి ముదిగొండ శాస్త్రి, పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పద్య పాదూషా జాషువా: చింతలపాటి - Tholi Paluku