Let's talk: editor@tmv.in
పుణేలో భారీ అగ్నిప్రమాదం

పుణేలో భారీ అగ్నిప్రమాదం

Panthagani Anusha
27 సెప్టెంబర్, 2025

పూణే నగరంలోని ఉండ్రి ప్రాంతంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగదాంబ భవన్ రోడ్డులోని మార్వెల్ ఐడియల్ సొసైటీ అనే 14 అంతస్తుల భవనంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో భవనం 12వ అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో హఠాత్తుగా మంటలువ్యాపించగా ఈ ఘోర ప్రమాదంలో 15 ఏళ్ల బాలుడు మరణించగా మంటలను ఆర్పే ప్రయత్నంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు.

అగ్నిప్రమాదం సమాచారం అందగానే ఐదు ఫైర్ ఇంజన్లు, హైడ్రాలిక్ లాడర్‌తో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కాగా మంటలను అదుపు చేసే సమయంలో ఫ్లాట్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు కారణంగా మంటలు ఆర్పుతున్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి, అక్కడ చిక్కుకున్న ముగ్గురు నివాసితులకు గాయాలయ్యాయి. కాగా గాయపడిన వారందరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన 15 ఏళ్ల బాలుడు మరణించగా మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉంది అని అధికారులు వెల్లడించారు. మంటలు పూర్తిస్థాయిలో రావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల అసలు కారణమేమిటో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సిలిండర్ పేలుడు మంటల తీవ్రతను పెంచిందని తెలుస్తోంది.

పుణేలో భారీ అగ్నిప్రమాదం - Tholi Paluku