Let's talk: editor@tmv.in
పెట్రోల్, డీజిల్ ధరలపై మౌనం ఎందుకు?

పెట్రోల్, డీజిల్ ధరలపై మౌనం ఎందుకు?

Gaddamidi Naveen
24 సెప్టెంబర్, 2025

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ను ప్ర‌జ‌లు నిలదీస్తున్నారు. 2017లో దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ వ్యవస్థను 'వన్ నేషన్, వన్ ట్యాక్స్' పేరుతో ప్రచారం చేశారు. అయితే అసలు అమలులోకి వచ్చిన తీరును చూసినపుడే ప్రజలకు అసలైన భారంగా మారింది. ముఖ్యంగా రోజువారీ ఉపయోగించే వస్తువులపై ఉన్న అధిక జీఎస్టీ శాతం ద్వారా చిన్న వ్యాపారులపై ప‌న్నుల భారంపడుతుంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి ఎందుకు తేలేక‌పోతున్నార‌ని

ప్ర‌జ‌ల కేంద్రం ప్ర‌భుత్వాని ప్ర‌శ్నించారు.

దేశ ప్రజల జీవనోపాధికి అత్యంత ముఖ్యమైన ఇంధనాలైన పెట్రోల్ , డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాలలో అమాంతం పెరిగిపోయయి. ఈ పెరుగుదల వల్ల ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా ఉండటం పట్ల ప్ర‌జ‌లు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ప్ర‌జ‌లు వినియోగించే నిత్య వస్తువుల ధరలు పెరుగుదలకు కారణం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం.

అంతర్జాతీయ ధరలు తగ్గినా

ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత మూడు సంవత్సరాలలో అనేకసార్లు పడిపోయాయి. కరోనా తరువాత కాలంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 40నుంచి60 మధ్యకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఆ తగ్గుదల ప్రయోజనం దేశీయ వినియోగదారులకు అందలేదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సెస్ పేరుతో అధిక పన్నులు విధిస్తూ వస్తోంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ ఎక్సైజ్ సెస్ పేరుతో పన్నులు విధించింది. వీటి ప్రభావం ప్రజలపై పడుతుంది.

ప‌న్నుల ధ‌ర‌ల భారం

2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధర 70 లోపు, డీజిల్ ధర 55నుంచి60 మధ్య ఉండేది. కానీ, 2024-2025 నాటికి పెట్రోల్ ధర 110 దాటింది, డీజిల్ ధర 95 పైగా చేరింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్రం విధించిన ఎక్సైజ్ సెస్. మోదీ సర్కార్ ఇటు తాము పెట్రోలు ధరలు పెంచలేదని చెబుతూ, అటు ఎక్సైజ్ సెస్ రూపంలో ఆదాయాన్ని పెంచుకుంది. ఇది ప్రజలపై భారం మోపినట్లే కాకుండా, రాష్ట్రాల ఆదాయ వాటాను కూడా తగ్గించింది. దీంతో రాష్ట్రాల పరిపాలన కూడా ఇబ్బందుల్లో పడింది.

వ్యవసాయ రంగానికి గట్టి దెబ్బ

ఇంధన ధరల పెరుగుదల వల్ల రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ట్రాక్టర్లు, మోటర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరగడంతో సాగు వ్యయాలు భారీగా పెరిగాయి. ఇది చివరికి వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ప్రజలు దినసరి వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ ప‌రిధిలోకి రావ‌డం వ‌ల్ల దేశ ప్ర‌జ‌ల‌కు కొంత పన్ను భారం త‌గ్గుతుందని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం “ధరల తగ్గింపు” పేరిట చిన్న చిన్న ప్రకటనలు చేయడం చూస్తుంటే, ఇవన్నీ ఓ రాజకీయ ప్రయోజనా కోసం అని ప్ర‌జ‌లు విమర్శిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని ప్రతి పౌరుడి జీవన ప్రమాణంపై ప్రభావం చూపుతున్నప్పటికీ, కేంద్రం తీసుకుంటున్న విధానాలపై స్పష్టత లేదు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఇంధన ధరలపై కేంద్రం మౌనం ఎందుకు? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం ఇంకా రాలేదు. కానీ, రాబోయే ఎన్నికల్లో ప్రజలే తమ నిర్ణయంతో దీనికి సమాధానం చెబుతారేమో చూడాలి.

పెట్రోల్, డీజిల్ ధరలపై మౌనం ఎందుకు? - Tholi Paluku