Let's talk: editor@tmv.in
పక్షపాతం లేకుండా నిధులు విడుదల చేయాలి

పక్షపాతం లేకుండా నిధులు విడుదల చేయాలి

Pinjari Chand
8 అక్టోబర్, 2025

కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రాజకీయ పక్షపాతం చూపకుండా రాష్ట్రాలకు విద్యా నిధులు విడుదల చేయాలని తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమోళి మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తిరుచ్చిలోని అన్నా స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రి ట్రోఫీ స్కూల్ గేమ్స్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన తర్వాత అన్బిల్ మహేశ్​ విలేకరులతో మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్టీఈ నిధులను రాష్ట్రానికి కేటాయించలేదని, దీనివల్ల దాదాపు 60,000 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులను అందిస్తుందని ఆయన వివరించారు. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కేటాయించిన నిధులను ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మహేశ్​ అన్నారు. అలాగే విద్యా హక్కు దరఖాస్తుల పోర్టల్ క్రాష్ అయిందని, ఈ సమస్యను త్వరలోనే అధిగమిస్తామని అన్నారు. అవసరమైతే గడువును పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుచ్చి జిల్లా కలెక్టర్ శరవణన్, క్రీడా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పక్షపాతం లేకుండా నిధులు విడుదల చేయాలి - Tholi Paluku