Let's talk: editor@tmv.in
నేను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

నేను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

Gaddamidi Naveen
29 జనవరి, 2026

తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పలు ఆసక్తికర అంశాలను పేర్కొంటూ, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.తాను ఇప్పటివరకు బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే, బీఆర్ఎస్‌ పార్టీ తనను సస్పెండ్‌ చేసినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం కూడా తనకు అందలేదని తెలిపారు.

2024 మార్చి నెలలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఒక సమావేశానికి తాను హాజరైన విషయం నిజమేనని దానం నాగేందర్‌ అంగీకరించారు. అయితే, ఆ సమావేశానికి పార్టీ ప్రతినిధిగా కాకుండా, పూర్తిగా వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్లానని అఫిడవిట్‌లో వివరించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలన్న ఉద్దేశంతోనూ, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనూ తాను ఆ సమావేశానికి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. తన చర్యలు అనర్హతకు కారణం కావని అఫిడవిట్‌లో దానం నాగేందర్‌ పేర్కొన్నారు.

నేను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ - Tholi Paluku