Let's talk: editor@tmv.in
నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌

నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌

Gaddamidi Naveen
25 డిసెంబర్, 2025

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విజయాన్ని సాధిస్తుందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించి, తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టంగా తెలిపారు. పార్టీ మార్పు అనే ప్రశ్నే లేదని, కాంగ్రెస్‌తోనే తన రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందని అన్నారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయని దానం తెలిపారు.

ఇక హైదరాబాద్ అభివృద్ధిపై కూడా దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పరిధిని అవుటర్ రింగ్ రోడ్, వరకూ విస్తరించడంతో నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ విస్తరణతో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు, పట్టణ ప్రణాళిక మరింత మెరుగుపడతాయని చెప్పారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఇది కీలక అడుగుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని దానం నాగేందర్ తెలిపారు.