
నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: భోజ్‌పురి నటుడు
భోజ్ పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహగానాల వేళ ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. శనివారం సోషల్ మీడియా అయిన ఎక్స్ లో పోస్ట్ చేశారు. నా భోజ్ పురి ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఈ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీలో చేరలేదని, నిజమైన సైనికుడిగా పార్టీకి సేవలందిస్తానని ఈ సందర్బంగా తెలిపారు. ఇటీవల పవన్ సింగ్ ఆరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఊహగానాల నేపథ్యంలో ఆయన పై విధంగా ట్వీట్ చేసి వదంతులకు ఫుల్ స్ఠాప్ పెట్టారు. ఇక పవన్ సింగ్ మాట్లాడుతూ, తాను ఎన్డీయే అగ్రనేతల ఆహ్వానం మేరకే బీజేపీలో తిరిగి చేరానని, సీటు కేటాయింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పవన్ సింగ్ 2024లో లోక్ సభ ఎన్నికలకు ముందు కరకట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో, ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా బీజేపీ బహిష్కరించింది. తిరిగి ఇటీవలే బీజేపీలో చేరారు.
పీకేను కలిసిన పవన్ సింగ్ భార్య జ్యోతిసింగ్
ఈ పరిణమాల మధ్య పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె వివరిస్తూ తాను పోటీ చేయడానికో, టికెట్ అడగాడానికో ఆయనను కలవలేదని, తనకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదన్న ఉద్దేశంతోనే కలిసినట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ జ్యోతి జీ వ్యక్తిగత వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. కానీ ఆమె భద్రత, ప్రజాస్వామ్య హక్కులకు మేం మద్దతు ఇస్తామని ఆమె చట్టపరంగా తన న్యాయం కోసం పోరాడాలని చెప్పారు. ఇక పవన్ సింగ్ ,జ్యోతి సింగ్ కు 2018లో వివాహామైంది. అయితే మానసికంగా, శారీరకంగా తనను వేధించాడని, ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ జ్యోతి సింగ్ 2021 లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు 4 సంవత్సరాలుగా కోర్టులో కొనసాగుతోంది. ఇటీవల జ్యోతి సింగ్ పవన్ ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకొని ఆరోపణలు చేయడంతో వివాదం మళ్లీ రాజుకుంది. దీనిపై పవన్ సింగ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇది పబ్లిసిటీ కోసం ఆడిన నాటకం మాత్రమే, జ్యోతి చేసిన పని పూర్తిగా రాజకీయ ప్రేరితమైనదేనని. ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని. నేను ఎవరికీ అన్యాయం చేయలేదని వివరించారు.
