Let's talk: editor@tmv.in
నేడు తెలంగాణ బంద్

నేడు తెలంగాణ బంద్

Gaddamidi Naveen
18 అక్టోబర్, 2025

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష, బీసీ సంఘాలు హైదరాబాద్‌లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరబాగ్‌ కూడలి నుంచి ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రవ్యాప్త బంద్ కు మద్దతిస్తున్నామ‌రని రాష్ట్రంలోని పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి.

బీసీ ఐకాస చైర్మన్ ఆర్.కృష్ణయ్య, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ ఐకాస వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగానికి పైన ఉన్న బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. నేడు తెలంగాణ జ‌రిగే బంద్‌లో పార్టీలు, సంఘాలకు అతీతంగా శ్రేణులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.