Let's talk: editor@tmv.in
నేడు తెలంగాణలో భారీ వర్షాలు

నేడు తెలంగాణలో భారీ వర్షాలు

Gaddamidi Naveen
30 జులై, 2026

తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ తీవ్ర వర్ష సూచన జారీ చేసింది. తీవ్రమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న 36 గంటల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ప్రత్యేకంగా భారీ వర్షాలు ప్రభావం చూపే జిల్లాల్లో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సూచనలు, జాగ్రత్తలు తెలియజేయాలని వాతావరణ శాఖ తెలియజేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు అందించే సూచనలు పాటించాలని కోరారు. మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

అయితే దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, నీటి ప్రవాహాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు
TelanganaRainsHeavyRainAlertFloodAlertNorthTelanganaTelanganaWeatherMonsoon2026RainUpdateWeatherAlertFloodWarning
నేడు తెలంగాణలో భారీ వర్షాలు - Tholi Paluku