Let's talk: editor@tmv.in
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
10 డిసెంబర్, 2025

ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఓయూ అభివృద్ధికి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడమని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులు, బోధనా సిబ్బంది సూచనలు తప్పనిసరిగా ప్రతిబింబించాలని సీఎం ఆదేశించారు. ఓయూ అభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతుందని ఆయ‌న పేర్కొన్నారు.

ఓయూ విద్యార్థి ఉద్యమ చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక చిహ్నాలను ఏర్పాటు చేసే ఆలోచనను కూడా సీఎం సూచించారు. ఈ నెల 10న స్వయంగా ఓయూను సందర్శించి అకడమిక్ బ్లాకులు, హాస్టళ్లను పరిశీలిస్తానని సీఎం తెలిపారు. అభివృద్ధి నమూనాలను ముందుగా విద్యార్థులు, సిబ్బందికి చూపించి వారి సూచనలు స్వీకరించేందుకు డ్రాప్‌బాక్స్‌లు, ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందిన అభిప్రాయాల ఆధారంగా ఈ నెలాఖరుకు తుది అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేయాలని నిర్ణయించారు.

నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku