Let's talk: editor@tmv.in
నేడు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ విడుదల

నేడు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ విడుదల

Gaddamidi Naveen
8 డిసెంబర్, 2025

సంక్రాంతి సందడి ఇంకా ప్రారంభంకముందే తెలుగు సినీప్రేక్షకుల ముందుకు కొత్త వినోదాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా. గోదావరి యాస, ఆప్యాయం, అల్లరి, పట్టుదల ఇవన్నీ కలగలిసిన గోదారొళ్ళ సహజ స్వభావాన్ని హాస్యభరితంగా చూపించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతుందనడానికి విడుదలైన ప్రమోషనల్ లైన్లు మంచి ఉదాహరణగా నిలిచాయి. “మా గోదారొళ్ళకి ఎటకారం, మమకారం, పట్టుదల కూడా కూసంత ఎక్కువే…” అన్న వాక్యం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జనవరి 23, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని పుల్స్-పవర్‌ఫుల్ టగ్-ఆఫ్-వార్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని చిత్రబృందం తెలిపింది. వినోదంతో పాటు గ్రామీణ జీవనశైలి, స్థానిక సంస్కృతి, వ్యక్తుల ఆత్మగౌరవం వంటి అంశాలను కూడా కథలో మిళితం చేసినట్లు సమాచారం. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే టైటిల్‌ మాత్రమే కాదు, ఇందులో కనిపించే పాత్రలు, వారి భాష, హావభావాలు అన్నీ ప్రేక్షకులను కొత్త స్థాయి వినోద ప్రపంచంలోకి లాక్కెళ్లనున్నాయని యూనిట్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

అంతేకాక, సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. టీజర్‌తోనే చిత్రంలోని హాస్యం, కథా ధోరణి, యాక్షన్ టచ్, పాత్రల భావోద్వేగాలు ఎలా ఉండబోతాయో వెల్లడవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, చిన్న ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం.సంక్రాంతి తర్వాతి పండుగలా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఘనమైన వినోదాన్ని అందించబోతోందని యూనిట్‌ చెబుతోంది. టగ్-ఆఫ్-వార్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో నిండి ఉందని అంచనా.

ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. రూరల్ ఎంటర్ టైనర్ గా రాబోతునన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. కిషోర్ జలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.