Let's talk: editor@tmv.in
నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై విచారణ

నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై విచారణ

Gaddamidi Naveen
4 ఫిబ్రవరి, 2026

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు (బుధవారం) విచారణ చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ విచారణకు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్వయంగా హాజరై, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే అంశంపై తన వాదనలను వినిపించనున్నారు. ఫిరాయింపులకు సంబంధించిన కీలక ఆధారాలను ఈ సందర్భంగా స్పీకర్ నిశితంగా పరిశీలించనున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ విచారణ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల అనర్హత వేటుతో రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలవ్వగా, స్పీకర్ ఇప్పటికే ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల వివరణపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఇప్ప‌టికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చుతూ స్పీకర్‌కు అఫిడవిట్ సమర్పించారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని కాంగ్రెస్ మీటింగ్‌కు వెళ్లడం తన వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చారు.