Let's talk: editor@tmv.in
నేడు ఉదయం 11గంటలకే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

నేడు ఉదయం 11గంటలకే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

Gaddamidi Naveen
12 ఏప్రిల్, 2026

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల సమయం రానే వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (జనరల్, వొకేషనల్) పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12, 2026 (నేడు) ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ) అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థుల భవిష్యత్తు నేడు తేలనుంది.

విద్యార్థులు బోర్డు యొక్క అధికారిక https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తోనే రిజల్ట్స్‌ని పొందొచ్చు. ఫలితాల వివరాలను పత్రికలు, ఇతర ప్రింట్ మీడియా సంస్థలకు కూడా బోర్డు అందజేస్తుంది. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల విడుదల నేపథ్యంలో వెబ్‌సైట్లపై ఒత్తిడి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. . ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు సుమారు 4.89 లక్షలు, రెండో సంవత్సరం విద్యార్థులు సుమారు 5.07 లక్షల మంది ఉన్నారు.