
నేటి నుంచే భారత్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్
భారత క్రికెట్ అభిమానులకు తీపి కబురు దేశానికి చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్,హార్దిక్ పాండ్యా తిరిగి రావడంతో టీమిండియా బలం రెట్టింపు అయ్యింది మంగళవారం డిసెంబర్ 9న కటక్‌లోని బారాబతి స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరుకు భారత్ సిద్ధమైంది.
కెప్టెన్సీ మార్పులు కీలక ఆటగాళ్ల పునరాగమనం
మెడ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో నెగ్గి జట్టులోకి వచ్చారు అతనిపై నమ్మకంతో సెలెక్టర్లు ఏకంగా ఉప-కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు టాప్ ఆర్డర్‌లో తనదైన దూకుడు చూపించడానికి గిల్ సిద్ధంగా ఉన్నాడు ఆసియా కప్ తర్వాత జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో భారత్ బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో సమతూకం (బ్యాలెన్స్) పెరుగుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) శుభ్‌మన్ గిల్ (ఉప-కెప్టెన్) అభిషేక్ శర్మ తిలక్ వర్మ శివమ్ దూబే అక్షర్ పటేల్ జితేశ్ శర్మ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్) జస్‌ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి అర్ష్‌దీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా , వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్నారు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఖరారు చేసింది.
పరిమిత అవకాశాల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్కు ఈ సిరీస్‌లో చోటు దక్కకపోవడం గమనార్హం అతని స్థానంలో హార్దిక్ పాండ్యా రాకతో జట్టు కూర్పులో మార్పులు వచ్చాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మ్యాచ్‌ల షెడ్యూల్
కటక్‌లో తొలి పోరు తర్వాత ఈ సిరీస్ మిగతా మ్యాచ్‌లు ఈ కింది వేదికల్లో జరగనున్నాయి
న్యూ చండీగఢ్ (డిసెంబర్ 11) ధర్మశాల (డిసెంబర్ 14) లక్నో (డిసెంబర్ 17) , అహ్మదాబాద్ (డిసెంబర్ 19)
గిల్ , పాండ్యా పునరాగమనం భారత్‌కు ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంది ఒకవైపు పునర్నిర్మాణంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ ఆధిక్యం ప్రదర్శిస్తుందా లేదా అనేది చూడాలి.
