Let's talk: editor@tmv.in
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన

నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన

Gaddamidi Naveen
20 ఆగస్టు, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుంచి 10 రోజుల పాటు బ్రిటన్, అమెరికా దేశాలలో పర్యటించనున్నారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను సందర్శిస్తారు.

ఆగస్టు 20న న్యూఢిల్లీ నుంచి లండన్ బయలుదేరనున్న సీఎం, ఆగస్టు 21న ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిధిలోని బ్లవాత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సందర్శిస్తారు. అనంతరం ఎమిరేట్స్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్‌బాల్ ప్రజెంటేషన్‌ను తిలకిస్తారు. ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ బృందంతో ముఖాముఖి పాల్గొని, లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్‌లను సందర్శిస్తారు.

ఆగస్టు 24న అమెరికా చేరుకుని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ క్యాంపస్‌లను సందర్శిస్తారు. ఆగస్టు 25న బోస్టన్‌లోని నార్త్-ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధి బృందంతో సమావేశమవుతారు. ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసే ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి బయలుదేరి, ఆగస్టు 30న హైదరాబాద్ చేరుకుంటారు.