
నేటి నుంచి రాజమండ్రి- తిరుపతి విమాన సర్వీసు!
FL - SUNL
1 అక్టోబర్, 2025
అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రాజమండ్రి – తిరుపతి కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి – తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవం అక్టోబర్ 1 ఉదయం 9 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో జరుగుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథుగా హాజరు కాబోతున్నారు. ఈ కొత్త సర్వీసుతో ప్రజలు సులభంగా, త్వరగా రాజమండ్రి – తిరుపతి మధ్య ప్రయాణించ గలుగుతారు.
