Let's talk: editor@tmv.in
నూత‌న‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో తెలంగాణ ఎంపీల భేటీ

నూత‌న‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో తెలంగాణ ఎంపీల భేటీ

Gaddamidi Naveen
18 డిసెంబర్, 2025

బీజేపీ జాతీయ ప్రధాన కార్యనిర్వాహక అధ్యక్షులు నితిన్ నబీన్ సిన్హాని బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీకి చెందిన ప్రముఖ నేతలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడెం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలు నితిన్ నబీన్ శాలువాతో సన్మానించి, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడం కోసం చ‌ర్చించారు. అలాగే, తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రజా సమస్యలపై బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం అందిస్తున్న సహకారంపై ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో అభిప్రాయాల పరస్పర మార్పిడి జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ విధానాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.మొత్తంగా ఈ భేటీ సానుకూల వాతావరణంలో సాగి, పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దోహదపడేలా ముగిసింది.