Let's talk: editor@tmv.in
నిరంతర అభ్యాసంతోనే విజయం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

నిరంతర అభ్యాసంతోనే విజయం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Gaddamidi Naveen
8 నవంబర్, 2025

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ, విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతర అభ్యాసం మాత్రమే మార్గమని ఉద్బోధించారు. జీవితంలో విజయం సాధించడానికి శ్రద్ధ, క్రమశిక్షణ చాలా ముఖ్యమని, వీటిని పాటిస్తేనే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ ప్రసంగం విద్యార్థుల భవిష్యత్తులో విజయం సాధించడంలో స్పూర్తి కలిగించేలా నిలిచింది.

స్నాతకోత్సవలో మొత్తం 25 మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు.వీటితో పాటు, 2018 నుంచి 2023 కాలంలో ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు జిష్ణుదేవ్ వర్మ, ముఖ్య అతిథి జె బి రావు సమక్షంలో అందజేయబడ్డాయి. ఈ ఘట్టం విద్యార్థుల కృషి, ప్రతిభకు గుర్తింపుగా నిలిచింది.