Let's talk: editor@tmv.in
నామినేషన్‌ దాఖలు చేసిన బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత

నామినేషన్‌ దాఖలు చేసిన బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత

Gaddamidi Naveen
16 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ అధికారికంగా నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం షేక్‌పేట తహశీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, పద్మారావు గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు రాజ్‌కుమార్‌ పటేల్‌, దీదీప్య రావు, సమీనా యాస్మిన్‌ తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్‌ దాఖలు అనంతరం పార్టీ నాయకులు సునీత గోపీనాథ్‌కు మద్దతుగా ఉత్సాహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ చర్చలు వేడెక్కుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు కీలక ఘట్టంగా నిలిచింది.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల స్వీకరణ గడువు అక్టోబర్ 21 న ముగియనుంది. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. నవంబర్‌ 11న పోలింగ్‌, 14న కౌంటింగ్‌ ఉండనుంది. ఉప-ఎన్నికల విషయంలో ఇప్పటివరకు 20 అభ్యర్థులు, 22 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

నామినేషన్‌ దాఖలు చేసిన బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత - Tholi Paluku