
నాగఫణి శర్మ తెలుగు భాషకు దక్కిన మహావరం: భట్టి విక్రమార్క
ద్విశతావధానం, సహస్రావధానం నిర్వహించి పద్మశ్రీ అవార్డు అందుకున్న మాడ్గుల నాగఫణి శర్మ తెలుగు భాషకు దక్కిన మహావరం అని ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రముఖ సాహితీవేత్త మాడుగుల నాగఫణి శర్మ గారి సన్మాన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పండితుల మధ్య మాట్లాడటానికి ధైర్యం కావాలి. అప్పటి ప్రధాని పీవీనరసింహరావు కూడా నాగఫణి తో అవధానంలో పాల్గోని ఆయనను అభినందించారు. అవధాన ప్రక్రియ విద్యార్థుల్లో ధారణశక్తి, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని, ఈ సంప్రదాయాన్ని బాల్యం నుంచే నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు–సంస్కృత భాషల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ విశిష్ట అవధాన సంప్రదాయం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. అవధానాన్ని కూడా సాధారణ ప్రజలకు పరిచయం చేశారు. అన్ని సమకాలీన విషయాలపై కూడా అవగాహన ఉండాలి. క్రికెట్ పై కూడా ఆయన అవధానం చేశారు. ఆయనను సన్మానించుకోవడం గర్వకారణం.
బాల్యంలో అనేక కష్టాలు పడ్డారు
ఆయన జీవితం సులభంగా సాగలేదు. కరెంట్ లేకున్నా కిరోసిన్ దీపం వెలుగులో చిన్నప్పటి నుంచి తిరుపతిలో నల్ల నరసింహ చార్యులు, నండూరి రామకృష్ణాచార్యులు, రామశర్మ పండితుల వద్ద అధ్యయనం చేశారు. పల్లెటూరు నుంచి చాలా ఎదిగారు. దేశం గర్వించదగ్గ అవధానిగా ఎదిగారు. ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ తో గౌరవించింది. మనం కూడా మన మాతృభాషను కాపాడుకుందాం. అవధానాన్ని కూడా సజీవంగా రక్షించుకుందాం. సంక్లిష్టమైన ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. హైద్రాబాద్ లో కూడా పీఠాన్ని ఏర్పాటు చేసి ఆయన అవధాన పక్రియను విద్యార్థులకు నేర్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు పాల్గోన్నారు.
