Let's talk: editor@tmv.in
నవంబర్‌ 15న అఖిలపక్ష–విద్యార్థి సంఘాల ఐక్య సమావేశం

నవంబర్‌ 15న అఖిలపక్ష–విద్యార్థి సంఘాల ఐక్య సమావేశం

Gaddamidi Naveen
9 నవంబర్, 2025

హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవంబర్‌ 15న నిర్వహించనున్న అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల ఐక్య పోరాట సమావేశం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే కనీసం 50 శాతం బకాయిలను విడుదల చేయాలి. కమిటీలు ఏర్పాటు చేసి కాలయాపన చేయడం సరికాదని, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆపి, ముందుగా కళాశాలలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా కళాశాలలపై బెదిరింపులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమ‌న్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలు సహా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు ఒకే వేదికపైకి వచ్చి ఐక్య పోరాటానికి సిద్ధమయ్యారు అని ఆయ‌న‌ తెలిపారు.ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా విద్యార్థి హక్కుల కోసం సమిష్టిగా పోరాటం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు.

నవంబర్‌ 15న అఖిలపక్ష–విద్యార్థి సంఘాల ఐక్య సమావేశం - Tholi Paluku