
నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో పలు గ్రామాలలో కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ,అధికారులతో కలసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. రామలింగాలగూడెం, అంతయ్యగూడెం, మామిడాల గ్రామాలలో తిప్పర్తి మండల కేంద్రంలో ఈ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి గింజకూ మద్దతు ధర రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా, ధాన్యం విక్రయించిన 72 గంటల్లోనే (మూడు రోజుల్లో) రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేయబడుతుందని హామీ ఇచ్చారు. ఈ వేగవంతమైన చెల్లింపు విధానం రైతులకు ఆర్థిక భారం పడకుండా దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా, నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లో ధాన్యం అమ్మి, కనీస మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రధాన ప్రాధాన్యతగా తీసుకుని ప్రతి పంటకు న్యాయమైన ధర అందించే విధంగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
