Let's talk: editor@tmv.in
నాలాల కబ్జాల వల్లే వరదలు: హైడ్రా

నాలాల కబ్జాల వల్లే వరదలు: హైడ్రా

Gaddamidi Naveen
16 సెప్టెంబర్, 2025

గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు నగరాన్ని ముంచెత్తుతుండగా, తగిన మౌలిక సదుపాయలు లేక , నాలాల కబ్జాలు కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్రంగా నీటి ముంపు నెలకొంది. ముఖ్యంగా అప్జల్ సాగర్, టోలి చౌకీ, మలక్పేట్, ముషీరాబాద్ వంటి లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉండడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నాలాల కబ్జాల వల్లే వరదలు వచ్చాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అదివారం ఇద్దరు వ్యక్తులు గల్లంతవడం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, మంగర్ బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సోమవారం పర్యటించారు.

ఇద్దరు వ్యక్తులు గల్లంతవడంపై అధికారుల నుంచి కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ హరిచందన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. నాలాలపై జరిగిన అక్రమ నిర్మాణాలేనని స్పష్టం చేశారు. నాలాలు ఉన్న దారులను అడ్డగించినట్టయితే, నీరు వేగంతో నివాసస్థలాలు, రహదారులపైకి వచ్చి ప్రజలకు ఇబ్భందికి గురిచేస్తుంది. అప్జల్ సాగర్ ప్రాంతంలో ఇటీవల కుండపోత వర్షానికి ఓ ఇంటి గోడ కూలి ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడం దురదృష్టకరమని కమిషనర్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. వెంటనే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగరంలో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలు గుర్తించి, వాటిని తొలగించలని అధికారులకు ఆదేశించారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.కొన్ని నాలాల పై నిర్మాణాలు ఉన్నాయి. వాటితో అందరికీ ప్రమాదమేనని హెచ్చరించారు. అప్జల్ సాగర్ పరిధిలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు. భవిష్యత్కు కార్యాచరణ ప్రణాళికగా వరద సమస్యను దీర్ఘకాలికంగా ఎదుర్కోవాలంటే మౌలిక వసతుల మెరుగుదల, వర్షనీటి ప్రవాహ మార్గాల శుద్ధి, నాలాల విస్తరణ వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు.

నాలాలపై అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని, అటువంటి నిర్మాణాలు చేస్తే మీరే స్వచ్ఛందంగా తొలగించాలని ప్రజలకు సూచించారు. అలాగే నగరం భద్రంగా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అవసరమని అన్నారు.

నాలాల కబ్జాల వల్లే వరదలు: హైడ్రా - Tholi Paluku